జాతీయ వార్తలు

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే లెఫ్ట్ ఫ్రంట్‌లో చీలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 8: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపొట్టుకోవాలన్న కొందరి వామపక్ష నేతల యోచన సిపిఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్‌లో చీలికకు దారితీసే ప్రమాదం ఏర్పడింది. ఈ ఫ్రంట్‌లోని భాగస్వాములైన పలుపార్టీలు కాంగ్రెస్‌తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో నాలుగు దశాబ్దాలుగా కలిసి ఉన్న ఈ వామపక్ష ఫ్రంట్ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. 2019లో వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుని పోటీ చేయాలన్న సిపిఐ (ఎం) యోచనను ఫ్రంట్‌లో భాగస్వాములుగా ఉన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బి), ద రివల్యూషనరీ సొషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌పి), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే తాము ఫ్రంట్ నుంచి బయటకు వెళ్లిపోతామని ఆ పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ‘కాంగ్రెస్‌తో అవగాహన ఏర్పర్చుకుని కేంద్రంలోని బీజేపీని ఓడిద్దామన్న యోచనను మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీలు రెండూ దొందూదొందే’ అని ఏఐఎఫ్‌బి స్టేట్ సెక్రటరీ నరేన్ ఛటర్జీ పిటిఐకి తెలిపారు..2016లో ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సిపిఐ(ఎం) అవగాహన పెట్టుకుని సీట్లను పంచుకుంది. అయితే దీనివల్ల సీపీఎం తీవ్రంగా నష్టపోగా, కాంగ్రెస్ మాత్రం లబ్ధి పొందిందని అన్నారు.