జాతీయ వార్తలు

శ్రీరాముడూ ఆపలేడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 8: ఆది నోరా, లేదా మోరి నా అనే విధంగా చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మాట్లాడుతున్నారు. సున్నితమైన అంశాలపై నోరు పారేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఇటీవల తరచుగా అనేక అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు దొరికిపోతున్నాడు. పైగా బీజేపీకి తలవంపులు తెస్తున్నారు. బైర్లాకు చెం దిన ఎమ్నెల్యే సింగ్ సమాజంలో అత్యాచారాలను నిలువరించలేమని, సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు దిగివచ్చినా ఏమి చేయలేరన్నారు. ఆ మధ్య ఈ ఎమ్మెల్యే తల్లితండ్రులు పిల్లలను సరిగా పెంచకపోవడం వల్ల మొబైల్ ఫోన్లను అమ్మాయిలు ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారన్నారు. పైగా దీని వల్ల వారిపై అత్యాచార ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. బైర్ల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యే బల్లియా అనే పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆ శ్రీరామచంద్రుడు కూడా ఆపలేరన్నారు. ప్రజలే ఇతరులను తమ కుటుంబ సభ్యులుగా చూసే సంస్కృతి పెరగాలని, సాటి మహిళల పట్ల సోదరీ భావంతోమెలగాలన్నారు. నైతిక విలువలను పెంపొందించాలని, అంతే కాని రాజ్యాంగం పరిరక్షిస్తుందని భావించరాదన్నారు. ఉన్నావ్ రేప్ ఘటనలో నిందితుడైన కులదీప్ సింగ్ సింగార్‌ను గతంలో ఈ ఎమ్మెల్యే వెనకేసుకుని వచ్చారు. ముగ్గురు పిల్లల తల్లిని ఎవరు రేప్ చేస్తారని ఆ సమయంలో ఆయన వ్యాఖ్యానించారు. కులదీప్ సింగ్ సెంగార్‌పై కుట్రతోనే ఇరికించారని ఈ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డాడు.