జాతీయ వార్తలు

నిర్లక్ష్యం వహిస్తే 50 ఏళ్లకే ఇంటికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 8: ఉత్తర ప్రదేశ్ విధి నిర్వహణలో అశ్రద్ద కనపరిచే ఉద్యోగులను ఇంటికి పంపించాలనుకుంటోంది. 50 సంవత్సరాలు నిండి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులను గుర్తించి, వారి కోసం నిర్బంధ (కంపల్సరీ) పదవీ విరమణ స్కీంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 16 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో నాలుగు లక్షల మంది విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి జూలై 31వ తేదీ లోపల నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 31వ తేదీ లోపల నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి. 2018 మార్చి 31వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించనున్నారు. 50 ఏళ్లు నిండిన ఉద్యోగులు నిర్బంధ పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాత్కాలిక లేదా శాశ్వత ఉద్యోగులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
కాగా ప్రభుత్వ ప్రతిపాదనలను యుపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యాదవేంద్ర మిశ్రా విమర్శించారు. ఈ అంశంపై సోమవారం చర్చించి కార్యాచరణ ప్రణాళికనుప్రకటించనున్నట్లు చెప్పా రు. కాగా 1986లో కూడా అప్పటి ప్రభు త్వం ఇటువంటి ఆదేశాలను జారీ చేసిందని, కాని అమలు కాలేదని ఆయన చెప్పారు. 50 ఏళ్లు నిండిన ఉద్యోగులకు మూడు నెలల నోటీసు ఇచ్చి నిర్బంధ పదవీ విరమణ చేయవచ్చని ఆయన చెప్పారు.1989,2000, 2007లో కూడా ఈ తరహా ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసినా అమలు కాలేదు. పనిచేయని, అవినీతి అధికారులను సహించే ప్రసక్తిలేదని ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. గత ఏడాది సివిల్ సర్వీసు అధికారులపై ఇదే నిబంధనను ఆదిత్యనాథ్ ప్రయోగించినా, అమలు కాలేదు. యుపీ ఐఎఎస్ అధికారుల సంఘం అప్పట్లో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది.