జాతీయ వార్తలు

రెండుసార్లు ‘నీట్’కు మేం వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: దేశంలో ఏడాదికి రెండు సార్లు నీట్ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని తమిళనాడు వ్యతిరేకించింది. ఈ విధానం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే కూడా నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను ఏటా రెండుసార్లు జరపాలన్న ఆలోచనపై మండిపడింది. ప్రతిసారీ నీట్‌పై గందరగోళ పరిస్థితులను సృష్టించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తింది. తమిళనాడు పాఠశాల విద్యా శాఖ మంత్రి సెంగొటయన్ కొయంబత్తూరులో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ నీట్, జేఈఈ పరీక్షలను ఏడాదిలో రెండు సార్లు నిర్వహించడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి దృష్టికి తీసుకెళతామని, తమిళనాడు వాదనను ప్రధాని నరేంద్ర మోదీకి కూడా వినిపిస్తామని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టుంగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలోనే ఇక నుంచి నీట్, జేఈఈ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు జరుగతాయని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై తమిళనాడు మంత్రి సెంగొటయన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని కేంద్రానికి సూచించారు. రెండు పర్యాయాలు నీట్ తదితర పరీక్షలను జరపడం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం లేకపోతే, విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నీట్‌ను ఏడాదిలో రెండు సార్లు నిర్వహించడం వల్ల గ్రామీణ విద్యార్థులు భారీగా నష్టపోతారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల సమస్యలు తప్పవని వ్యాఖ్యానించారు. జావడేకర్ ప్రతిపాదన వల్ల మెడికల్ కోర్సులకు సామాన్యులు దూరమవుతారని అన్నారు. కేంద్రం ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.