జాతీయ వార్తలు

కన్సాస్ కాల్పుల ఘటన కలచివేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: అమెరికాలోని కన్సాస్ నగరంలో ఆగంతకుల కాల్పులకు బలైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి శరత్ కొప్పు ఘటన పట్ల కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శరత్ కుటుంబానికి అవసరమైన సహాయాన్ని చేసి ఆదుకుంటామని ఆమె ట్వీట్ చేశారు. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సమయంలో కాల్పుల్లో శరత్ కొప్పు మరణించిన విషయం విదితమే. ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినా ఫలితం లేకండా పోయింది. ఈ ఘటన తనను కలచి వేసిందని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న శరత్ తండ్రి రామ్‌మోహన్ రెడ్డితో మాట్లాడానని, ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసినట్లు చెప్పారు.
కుటుంబ సభ్యుల్లో ఒకరు అమెరికాకు వెళ్లేందుకు తక్షణ సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. అమెరికా వీసాను కూడా సమకూరుస్తామన్నారు. వీలైనంత తొందరగా శరత్ కొప్పు మృతదేహాన్ని భారత్‌కు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాస్టర్ డిగ్రీ చేసేందుకు శరత్ ఈ ఏడాది జనవరిలో అమెరికాకు వెళ్లారు. కన్సాస్ నగరం మిస్సోరి రాష్ట్రంలో ఉంది. చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేస్తూ ఈ ఘటనపై మరణించిన శరత్ కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాల్పులు జరిపిన ఆగంతకుడి ఆచూకీ ఇస్తే పదివేల డాలర్లు ఇస్తామని ఇప్పటికే కన్సాస్ నగర పోలీసులు ప్రకటించారు. రెస్టారెంట్‌లో కాల్పుల ఘటనకు సంబందించి వీడియో క్లిప్పింగ్‌లను కూడా పోలీసులు విడుదల చేశారు.