జాతీయ వార్తలు

పార్లమెంట్ పరువు కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: పార్లమెంట్ ప్రతిష్టను కాపాడేందుకు ఎంపీలు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విజప్తి చేశారు. గతంలో వారు గొడవ చేశారు కాబట్టి తామిప్పుడు గొడవ చేస్తామనే వాదన ఎంతమాత్రం మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. ఎంపీలు నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సుమిత్రా మహాజన్ హితవు చెప్పారు. పార్లమెంట్‌లో తమ ప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఎలా పని చేస్తున్నారనేది ప్రజలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారనేది మరిచిపోరాదని ఆమె హెచ్చరించారు. సుమిత్రా మహాజన్ ఈ మేరకు లోక్‌సభ సభ్యులకు భావోద్రేకంతో కూడిన లేఖ రాశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్పీకర్ ఎంపీలకు ఈ లేఖ రాయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు పోడియం ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ గొడవ చేయటాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ పరోక్షంగా తప్పుబట్టారు. పార్లమెంట్ నియమ, నిబంధనలకు, గౌరవ ప్రతిష్టలకు లోబడి సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని స్పష్టం చేశారు.
భిన్నాభిప్రాయాలు, భిన్నమైన ఆలోచనలను వ్యక్తం చేయటం తప్పు కాదని, గతంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలు సభను సజావుగా సాగనివ్వలేదు కాబట్టి తాము కూడా సభా కార్యక్రమాలను అడ్డుకుంటామనడం సరికాదని సుమిత్రా మహాజన్ ఆ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగేలా చూడటం ప్రతి ఎంపీ నైతిక ధర్మమని అన్నారు. పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాల్లో రాజకీయ పోరాటాన్ని చేయాలి తప్పా, పార్లమెంట్‌లో కాదని హితవు పలికారు. పార్లమెంట్, ప్రజాస్వామ్యం పేరు ప్రఖ్యాతులను కాపాడుతూ సమావేశాల నిర్వహణకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేది నిర్ణయించేందుకు ఆత్మపరిశీలన చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని సుమిత్రా మహాజన్ సూచించారు. పవిత్ర ప్రజాస్వామ్య మందిరమైన పార్లమెంట్ ప్రతిష్ట, పవిత్రతలను కాపాడటం ఎంపీల సమష్టి బాధ్యత అని, ప్రజలు మన నుండి ఎంతో ఆశిస్తున్నారని, వారి ఆశలను వమ్ము చేయకూడదని స్పీకర్ ఎంపీలకు విజప్తి చేశారు. లోక్‌సభకు ఎంపిక కావటం చాలా గొప్ప విషయం. ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేవాలయ ప్రతిష్టను గొడవ, గందరగోళంతో దిగజార్చవద్దని వేడుకున్నారు. నియోజకవర్గం ప్రజల ఆశలు, ఆశయాలను పూర్తి చేయటంతోపాటు దేశాభివృద్ధి, ప్రజాస్వామ్యం పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఎంపీలు పార్లమెంట్ పరువు, ప్రతిష్టను కాపాడితేనే ప్రజలకు ఈ వ్యవస్థపై విశ్వాసం, నమ్మకం కొనసాగుతాయని, వారు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకం, విశ్వాసం పోతాయని సుమిత్రా మహాజన్ పరోక్షంగా హెచ్చరించారు. పార్లమెంట్ సజావుగా కొనసాగేందుకు అసరమైన నియమ, నిబంధనలను మనమే రూపొందించుకున్నామని, మనం రూపొందించుకున్న వాటిని కాపాడుకోవలసిన నైతిక బాధ్యత, తు.చ. తప్పకుండా పాటించవలసిన కర్తవ్యం మనపై లేదా అని సుమిత్రా మహాజన్ ఎంపీలను ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఎంపీలు వ్యవహరించే తీరు, జరిపే చర్చల ప్రభావం యువతపై పడుతుందని, ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల యువతకున్న అభిప్రాయాలపై పడుతుందని స్పీకర్ హెచ్చరించారు. గుణవంతులు వ్యవహరించే తీరును ఇతరులు అనుసరిస్తారు. అతడు స్థాపించిన విలువలను ఇతరులు కూడా పాటిస్తారన్న గీతోపదేశాన్ని ఆమె ఎంపీలకు రాసిన లేఖలో ఉటంకించారు. ఇతరులు అనుసరించే విధంగా ఎంపీల వ్యవహారం ఉండాలని ఆకాంక్షించారు.