జాతీయ వార్తలు

కొరియా శాంతిలో మాకూ భాగముంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: కొరియా ద్వీపకల్పంలో శాంతి సాధన ప్రక్రియలో భారత్ ప్రధాన భూమిక వహిస్తుందని, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లారేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జీతో చర్చలు జరిపారు. దక్షిణ కొరియా, భారత్ మధ్య సంబంధాలు బలపడాలని, ఈ రెండు దేశాల మధ్య మైత్రి పటిష్టంగా ఉందని చెప్పారు. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, ఆర్డ్ఫిషియల్ ఇంటెలిజెన్స్, వాణిజ్యం తదితర రంగాలపై పది ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు అణు నిరాయుధీకరణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. అనంతరం ప్రధాని మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఉమ్మడి ప్రకటన పత్రికలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఉత్తర కొరియా అణ్వస్త్రాల తయారీలో పొరుగు దేశం పాత్ర ఉందని పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగాఅన్నారు. అందుకే కొరియా ద్వీపకల్పంలో శాంతి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభం కావాలని, ఇందులో భారత్ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయన్నారు.
కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియా, దక్షిణాసియాలో శాంతి స్థాపనకు భారత్ తన వంతు కృషి చేస్తుందన్నారు. ఉత్తరకొరియాతో పాకిస్తాన్ అణు బంధంపై విచారణ జరగాలని భారత్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని భారత్ కోరుతోంది. ఇరు దేశాలు వ్యూహాత్మక అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్‌ను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ఆసియాసముద్ర జలాలపై చైనా ఆధిపత్య విస్తరణపై కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. కాగా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టం చేశారు. రక్షణ, భద్రత రంగాలు, మిలిటరీ వ్యూహాత్మక విభాగాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయయి. అణ్వాయుధాలు ఉగ్రవాదులకు అందకుండా, వాటిని దుర్వినియోగం జరగకుండా ఇరు దేశాలు అప్రమత్తంగా ఉండాలని తీర్మానించాయి. ఇటీల ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య జరిగిన చర్చలను ఈ ప్రకటనలో ఆహ్వానించారు. న్యూక్లియార్ సప్లైయర్స్ గ్రూప్‌లో భారత్‌కు సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు దక్షిణ కొరియా మద్దతు ఇస్తోంది. ఇరు దేశాలు మూడో దేశంలో త్రైపాక్షిక ఒప్పందం ద్వారా అభివృద్ధి రంగంలో భాగస్వాములు కావాలని నిర్ణయించాయి. తొలి దశలో భాగంగా ఆఫ్గనిస్తాన్‌లో ఇరు దేశాలు ఉమ్మడి అజెండాతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. ఏ దేశమైన అభివృద్ధిసాధించాలన్న, సంపన్న దేశంగా అవతరించాలన్నా, భద్రత ముఖ్యమని, ఈ రంగంలో ఇరు దేశాలు కీలక పాత్ర పోషించాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించారు. నిరంతర చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, ఉద్రిక్తతల నివారణకు చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఇరు దేశాలు గౌరవించుకోవాలని నిర్ణయించాయి.

చిత్రం..ఢిల్లీలో మంగళవారం జరిగిన చర్చల అనంతరం సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జీ, ప్రధాని నరేంద్ర మోదీ