జాతీయ వార్తలు

కేజ్రీవాల్, ఎల్జీ మధ్య మళ్లీ లడాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య మళ్లీ లడాయి మొదలైంది. ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) ఆదేశాలు జారీ చేశారు. గత వారమే సుప్రీంకోర్టు ఎల్జీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలులేదని తీర్పు ఇచ్చిన విషయం విదితమే. తీర్పు నేపథ్యంలో వివాదం సద్దుమణుగుతుందనుకున్నారు. కాని ఎల్జీ తాజా నిర్ణయంతో కేజ్రీవాల్ ప్రభుత్వం భగ్గుమంది. ఐఎఎస్ అధికారి సౌమ్యాగుప్తా స్థానంలో విద్యా శాఖ డైరెక్టర్‌గా సంజయ్ గోయల్‌ను నియమించారు. దక్షిణ ఢిల్లీ నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చంచల్ యాదవ్‌ను బదిలీ చేసి ఎల్జీ ప్రత్యేక కార్యదర్శిగా నిమయించారు. ఎన్ వసంతకుమార్‌ను వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేకకమిషనర్‌గా నియమించారు. ఎల్జీ చర్యలను ఉపముఖ్యమంత్రి మనీషా శిసోడియా తప్పుబట్టారు. ఏకపక్షంగా, నియంతగా ఎల్జీ వ్యవహరిస్తున్నారు. బదిలీలు చేసే ముందు ప్రభుత్వాన్ని ఎల్జీ సంప్రదించలేదన్నారు. ఢిల్లీ ప్రభుత్వం బడ్జెట్‌లో 26 శాతం నిధులను విద్యపైన కేటాయిస్తోందని, ఈ అధికారిని బదిలీ చేసే వేరే వారిని నియమించే ముందును తమను సంప్రదించలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా ఇంకా ఎల్జీ తీరులో మార్పులేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో అపీల్‌చేస్తామని ఆయన చెప్పారు.