జాతీయ వార్తలు

ఆయుష్మాన్ భారత్‌కు ఆధార్ తప్పనిసరి కాదు : కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్రం పేర్కొంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న వ్యక్తి తప్పనిసరిగా ఆధార్‌ను కలిగివుండాలని గెజిట్‌లో పొందుపరిచారంటూ వార్తలు రావడంతో కేంద్రం దీనిపై వివరణ ఇచ్చింది. ఏదైనా సంస్థలో లబ్ధిదారుడు చికిత్స పొందినప్పుడు ఆధార్ సంఖ్యను తీసుకుంటాయని, అయితే అది లబ్ధిదారుని గుర్తింపు కోసమేనని, తప్పనిసరి మాత్రం కాదని వివరించింది. దేశంలోని 10.74 కోట్ల మంది పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద సంబంధిత వ్యక్తి ఆసుపత్రి పాలైతే సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఆధార్ కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరుస్తాం అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆధార్ కార్డు లేకున్నా ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, పనికి ఆహార పథకం కార్డు ఇలాంటివి ఏమున్నా సరిపోతుందని వివరించారు.