జాతీయ వార్తలు

అవినీతికి దూరంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు అవినీతి ఆరోపణలకు తావులేకుండా జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవహరించాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ (సీపీడబ్ల్యుడీ) శాఖపై వస్తున్న అవినీతి అభియోగాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ ఆయన సీడీడబ్ల్యుడీ 164వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో అవినీతినిపై నరేంద్రమోదీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందన్నారు. అవినీతిని పారదోలేందుకు ప్రజలు, ప్రభుత్వం సమిష్టిగా పనిచేయాలన్నారు. ఒక ప్రభుత్వ శాఖలో అవినీతి గురించి ఉపరాష్టప్రతి మాట్లాడడంపై మీరు ఆశ్చర్యం వ్యక్తం చేయవచ్చని, కాని దేశంలో పాతుకుపోయిన అవినీతి నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమన్నారు. ప్రతి శాఖపై అవినీతి ఆరోపణలు ఉండడం సహజమని, కాని ఈ శక్తుల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విషయమై సీపీడబ్ల్యుడీ ఉద్యోగులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అంకిత భావంతో పనిచేయాలని ఆయన కోరారు. తాను 2015లో మంత్రిగా ఉన్నప్పుడు ఈ శాఖ గురించి ఎంతో ఆందోళన చెందానన్నారు. ఈ శాఖ పనితీరులో మార్పు కోసం కృషి చేశానన్నారు. ప్రజల దృక్పథంలో మార్పు వచ్చేందుకు వీలుగా క్రమశిక్షణ, సంకల్పంతో పనిచేయాలన్నారు. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ, గత ఏడాది సీపీడబ్ల్యుడీ శాఖ రూ.15వేల కోట్ల పనులు చేపట్టిందన్నారు. నిర్మాణాల్లో పర్యావరణం, హరిత సంపదకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్, ప్లానర్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇది మంచి పరిణామమన్నారు. ప్రతి భవన నిర్మాణం పరిధిలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మిస్తున్నారన్నారు. నాణ్యత విషయంలో ఉద్యోగులు రాజీపడకుండా పనిచేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేయాలన్నారు. నిర్ణీతకాలపరిమితిలోపల పనులను పూర్తి చేయాలన్నారు. పర్యాటక శాఖ సహాయ మంత్రి కెజే ఆల్ఫాన్స్ మాట్లడుతూ పర్యాటక రంగంలో ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో కూడిన వౌలిక సదుపాయాలను సీపీడబ్ల్యుడీ నిర్మించిందన్నారు. వచ్చే ఐదేళ్లలో విదేశీ పర్యాటకుల ద్వారా వంద బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
చిత్రం..సీపీడబ్ల్యుడీ వార్షికోత్సవానికి విచ్చేసిన ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడుకు జ్ఞాపికను అందిస్తున్న దృశ్యం