జాతీయ వార్తలు

ఐరాసకు సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: జమ్మూకాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ యుఎన్ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నివేదిక అభూతకల్పన అని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. ‘అది వ్యక్తిగత అభిప్రాయమే. యుఎన్ మానవ హక్కుల కమిషన్ అన్నది అసలు అంతర్జాతీయ సంస్థేకాదు’అని మంత్రి కొట్టిపారేశారు.‘నివేదికకు ఐరాసకు ఎలాంటి సంబంధం లేదు’అని శుక్రవారం మంత్రి తెలిపారు. దానికి ఎలాంటి చట్టబద్దతలేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈవారం ఆరంభంలో ఐరాసలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీ కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రస్తావించారు. యుఎన్ మానవ హక్కుల హైకమిషనర్ జైద్ రాడ్ ఉల్ హుస్సేన్ నివేదికను ప్రస్తావిస్తూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఓ అంతర్జాతీయ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించినట్టు జూన్ 14 నాటి నివేదికలో పేర్కొన్నారు.
అయితే నివేదిక పక్షపాతంలో కూడుకున్నదని, దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని, సమగ్ర విచారణ లేదా అధ్యయనం జరపకుండా నివేదిక రూపొందించారని ఐరాసలో భారత రాయబారి తన్మయ లాల్ విరుచుకుపడ్డారు. మీడియా కథనాల ప్రకారం లండన్‌కు చెందిన పాకిస్తాన్ సంతతి పాత్రికేయుడు జాఫర్ బంగాష్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే హుస్సేన్ ఈ వివాదాస్పద నివేదిక రూపొందించారు. దీన్ని భారత్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. నివేదిక అసలు స్వరూపాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ గురువారం బయటపెట్టారు. ఓ దురుద్దేశంతో, పక్షపాతంగా నివేదిక రూపొందించారని ఆయన విమర్శించారు. అలాగే ఢిల్లీలో గ్లోబల్ డైలాగ్ సెక్యూరిటీ సమ్మిట్ సెమినార్‌లో మాట్లాడిన వీకే సింగ్ ‘యుఎన్ మానవ హక్కుల కమిషన్ అన్నది అసలు అంతర్జాతీయ సంస్థేకాదు’అని తిప్పికొట్టారు. భారత్ ఎప్పుడూ హద్దుమీరదని, భద్రత విషయంలో అత్యంత నిజాయితీగా వ్యవహరిస్తుందని ఆర్మీ మాజీ చీఫ్ సింగ్ స్పష్టం చేశారు.