జాతీయ వార్తలు

చైనా వత్తిడికి లొంగిన ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా వత్తిడికి లొంగి పర్వత యుద్ధ బటాలియన్ (వౌంటేన్ స్ట్రిక్ కార్ప్స్) ఏర్పాటును రద్దు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ కొంత కాలం క్రితం ఎజెండాలేని చైనా పర్యటన జరపటం తెలిసిందే. ఎజెండాలేని ఈ పర్యటన అసలు ఎజెండా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ శక్తుల వత్తిడికి లోనయ్యారు. ఇది బీజేపీ దేశ భక్తికి నిదర్శనమని రాహుల్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వనరుల కొరత మూలంగా కొత్త బటాలియన్ల ఏర్పాటు, కొత్త సైనికులను చేర్చుకునే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు. చైనా అధినాయకత్వం తెచ్చిన వత్తిడి మూలంగానే మోదీ వౌంటేన్ స్ట్రైక్ బటాలియన్ ఏర్పాటును రద్దు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.