జాతీయ వార్తలు

అంతా సహాయకులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని 19మంది కొత్త సహాయ మంత్రులతో నింపేశారు. ప్రస్తుత సహాయ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు మాత్రమే కేబినెట్ హోదా పదోన్నతి కల్పించి అందరినీ ఆశ్చర్యపర్చారు. బిజెపికి చెందిన ఐదుగురు సహాయ మంత్రులకు ఉద్వాసన పలకటం ద్వారా మానభంగాలకు పాల్పడేవారికి, అసమర్థులకు తన మంత్రివర్గంలో స్థానం ఉండదని స్పష్టం చేశారు. 19మంది కొత్త సహాయ మంత్రుల్లో ఇద్దరు మహిళలు కృష్ణరాజ్, అనుప్రియలకు స్థానం లభించింది. ఈ ఇద్దరు మహిళలూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కావటం గమనార్హం. ఇదిలావుంటే, నరేంద్ర మోదీ కొత్తవారిలో ఏ ఒక్కరికీ కేబినెట్ హోదా ఇవ్వకపోవటం చర్చనీయంశమైంది. మంత్రివర్గం విస్తరణలో ఒక సిక్కు (అహ్లూవాలియా), ఒక ముస్లిం మైనారిటీ (ఎంజె అక్బర్)కి ప్రాతినిధ్యం కల్పించారు. 19మంది కొత్త సహాయ మంత్రులతో కేబినెట్ సంఖ్య 78కి చేరింది. రాష్టప్రతి భవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఒక కేబినెట్ మంత్రి ప్రకాశ్ జావడేకర్, 19మంది సహాయ మంత్రులు ఫగ్గన్ సింగ్ కులస్తె, ఎస్‌ఎస్ అహ్లూవాలియా, రమేష్ చందప్ప జిగజినగి, విజయ్‌గోయల్, రాందాస్ అథావలే, రాజెన్ గొహేన్, అనీల్ మాధవ్ దవే, పర్షోత్తం రుపాలా, ఎంజె అక్బర్, అర్జున్‌రాం మేఘవాల్, జస్వంత్‌సింగ్ సుమన్‌భాయి బాభోర్, డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, అజయ్ టామ్టా, కృష్ణరాజ్, అనుప్రియ, మన్సుక్ మండవియా, సిఆర్ చౌదరి, పిపి చౌదరి, సుభాష్ రామారావు బామ్రేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. మానభంగం కేసులో ఇరుక్కున్న రాజస్తాన్‌కు చెందిన నిహాల్ చంద్, తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించనందుకు ఆర్‌ఎస్ కథెరియా, సన్వర్‌లాల్ జాట్, మన్సుక్‌బాయి డి వాసా, ఎంకె కుందరియాలను మంత్రివర్గం నుండి తప్పించారు. కేబినెట్ విస్తరణలో రాజస్తాన్‌కు నాలుగు మంత్రి పదవులు దక్కితే, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు మూడేసి మంత్రి పదవులు లభించాయి. మహారాష్టక్రు రెండు మంత్రి పదవులు లభిస్తే పశ్చిమ బెంగాల్, కర్నాటక, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది. రాజస్తాన్ నుండి రాజ్యసభకు ఎంపికై మంత్రి పదవి దక్కించుకున్న విజయ్ గోయల్ వాస్తవానికి ఢిల్లీకి చెందినవాడు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన 19మంది సహాయ మంత్రుల్లో ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి సహాయ మంత్రి పదవి దక్కించుకున్న అహ్లూవాలియా వాస్తవానికి బీహార్‌కు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్‌లో అతనికి షౌటింగ్ బ్రిగేడ్ అనే పేరుండేది. ఇదిలావుంటే సహాయ మంత్రిగా నియమితులైన అనుప్రియ పటేల్ తన పార్టీ అప్నాదళ్‌ను సోమవారమే అమిత్ షా సమక్షంలో బిజెపిలో విలీనం చేయటం తెలిసిందే. ఇకపోతే మరో సహాయ మంత్రి రాందాస్ అథాలే మిత్రపక్షమైన ఆర్‌పిఐకి చెందిన నాయకుడు. ఎంజె అక్బర్ గతంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పని చేయటంతోపాటు బిహార్‌లోని కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించటం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించినా ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌కు మాత్రం పదవి దక్కకపోవటం గమనార్హం.
కేబినెట్ మంత్రులు వద్దా?
నరేంద్ర మోదీ కొత్తగా తీసుకున్న 19మందిలో ఒక్కరికీ కేబినెట్ హోదా ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది. కొత్తవారిలో కొందరిని స్వతంత్ర మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. పాత సహాయ మంత్రులలో కేవలం ప్రకాశ్ జావడేకర్‌కు మాత్రమే కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభించింది. దీనితో మిగతా సహాయ మంత్రులు ముఖ్యంగా స్వతంత్ర మంత్రులు తీవ్ర నిరాశకు గురైనట్టు తెలిసింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇంధన మంత్రి పీయూష్ గోయల్‌కు కేబినెట్ మంత్రిగా ఉదోన్నతి లభించటం ఖాయమని బిజెపి వర్గాలు పరోక్షంగా సూచించాయి. అయితే అంచనాలకు విరుద్ధంగా ప్రకాశ్ జావడేకర్‌కు పదోన్నతి లభించి పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌లకు మొండి చెయ్యి ఎదురైంది. గోయల్, ధరేంద్ర ప్రధాన్‌తోపాటు మరో నలుగురు మంత్రులు పదోన్నతిని ఆశించారని అంటున్నారు. తాము కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించలేదని వారు వాపోతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం తమ కార్యాలయంలో కొత్త మంత్రులతో సమావేశమై కష్టపడి సమర్థంగా పని చేయాలని హితవు చెప్పారు.

చిత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లోకి మంగళవారం కొత్తగా చేరిన మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో గ్రూప్ ఫొటో