జాతీయ వార్తలు

16న అంతర్రాష్ట్ర మండలి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 7: దాదాపు పది సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత అంతర్‌రాష్ట్ర మండలి సమావేశం అవుతోంది. కేంద్ర-రాష్ట్ర సమస్యలు, అంతర్గత భద్రత, దళితులపై దాడులు, రాష్ట్రాల్లో కేంద్ర పథకాల అమలు వంటి అంశాలను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. 2006లో యుపిఏ హయాంలో చివరిసారి అంతర్ రాష్ట్ర మండలి సమావేశం జరిగింది. ఆ తరువాత యూపీఏ సర్కారు అంతర్రాష్ట్ర మండలిని పక్కన పెట్టి ప్రణాళికా సంఘానికి ప్రాధాన్యమిచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఏ ప్రణాళికాసంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయటం తెలిసిందే. నీతి ఆయోగ్‌ను ఏర్పాటుతో పాటు అంతర్రాష్ట్ర మండలిని కూడా పునరుద్ధరించారు. ప్రధానమంత్రి చైర్మన్‌గా, సీనియర్ కేబినెట్ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, మనోహర్ పారికర్‌లను సభ్యులుగా మండలికి నామినేట్ చేశారు. అంతర్రాష్ట్ర మండలి పరిధిలో ఐదు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన ఐదు ప్రాంతీయ మండళ్ల సమావేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రతి ప్రాంతీయ మండలి సమావేశానికి ఆ పరిధిలోని ముఖ్యమంత్రులు హాజరు కావటంతోపాటు పలు సమస్యలపై లోతుగా చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో జరిగిన చర్చల ఆధారంగా తయారు చేసిన నివేదికను ప్రధాని మోదీకి రాజ్‌నాథ్ అందజేస్తారు. ఈ నివేదికలోని సిఫారసుల ఆధారంగా ముఖ్యమంత్రులతో తదుపరి చర్చల ప్రక్రియను కొనసాగిస్తారు. కేంద్ర మంత్రిమండలిలోని అందరు కేబినెట్ మంత్రులతో పాటు పలువురు సీనియర్ అధికారులు అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రాల మధ్య సమస్యలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు, సమస్యలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపై ప్రధానంగా చర్చిస్తారని అంటున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని మరింత విస్తరించటంతోపాటు పటిష్టంగా అమలు చేయటం ద్వారా లబ్దిదారుల ప్రయోజనాలను కాపాడుతూ నిధులు దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. అందుకే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం వ్యవస్థను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దీంతోపాటు ఆధార్ కార్డు, సుపరిపాలన, ఆర్థిక, సామాజిక ప్రణాళికలు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తావించే అంశాలు, సమస్యల పరిష్కారానికి కూడా కృషి జరుగుతుందని అంటున్నారు.