జాతీయ వార్తలు

ఓబీసీ కమిషన్‌పై మీ వైఖరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందౌలి (యూపీ), ఆగస్టు 5: రాజ్యసభలో ఓబీసీ కమిషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని, నిజంగా ఓబీసీలంటే కాంగ్రెస్‌కు ప్రేమ ఉందా అని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, వెనకబడిన వర్గాల సముద్ధరణకు బీజేపీ తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వాలని ఆయన కవురారు. జాతీయ పౌర రిజిస్టర్ విషయంలో ఓటు బ్యాంకు వైఖరితో కాంగ్రెస్ అడుగులు వేస్తోందన్నారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిపై లోక్‌సభ ఆమోదం తెలిపిందని, రాజ్యసభకు ఈ బిల్లు వెళుతుందన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేందుకు నిర్దేశించిన బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతుందన్నారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ , రాజ్యసభలో కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనే విషయమై అందరూ చూస్తున్నారన్నారు. నిజంగా బీసీల సంక్షేమం అంటే కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడాలన్నారు. ఆదివారం ఇక్కడ మొగల్‌సరాయ్ రైల్వేస్టేషన్ పేరు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్‌గా మార్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. భారత భూభాగంలో చొరబడినన ప్రతి బంగ్లాదేశీయుడిని వెనక్కు పంపించాల్సి ఉందన్నారు. కాని మమతాబెనర్జీ, కాంగ్రెస్ నేతలేమో చొరబాటుదారులు వంతపాడేలా వ్యవహరిస్తున్నారన్నారు. దేశంలో జాతీయ పౌరరిజిస్టర్ నిర్వహించాలా వద్దా అనే విషయమై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని తెలియచేయాలన్నారు. మన దేశంలో చొరబాటుదారులను కొనసాగించాలా లేదా అనే విషయమై ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని విస్పష్టం చేయాలన్నారు. సమగ్రతకు కట్టుబడి ఉంటామని, ఈ విషయంలో రాజీలేదని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..కార్యక్రమంలో గదతో అభివాదం చేస్తున్న అమిత్ షా, సీఎం యోగి