జాతీయ వార్తలు

మెహుల్‌ను అప్పగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాంకులను మోసం చేసి పరారైన మెహుల్ చోక్సీని అప్పగించాలని కోరుతూ భారత్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ఆంటిగ్వా ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మెహుల్ చోక్సీ కరేబియన్ దేశంలో పౌరసత్వం తీసుకుని స్థిరపడ్డాడు. కేంద్రప్రభుత్వ అధికారులు ఆంటిగ్వాకువెళ్లి ఆ దేశ ప్రభుత్వానికి మెహుల్ చోక్సీని అప్పగించాలని కోరుతూ డాక్యుమెంట్లను సమర్పించారు. భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ ఈ బ్యాంకుకు చెందిన 2 బిలియన్ డాలర్ల మేర మోసం చేశారు.
విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ఆంటిగువా వెళ్లారు. నిరవ్‌మోదీతో కలిసి మెహుల్ పీఎన్‌బీ బ్యాంకును మోసం చేశాడు.2017 నవంబర్‌లోనే ఆంటిగ్వా అధికారులు మెహుల్ పౌరసత్వాన్ని ఖరారు చేశారు.