జాతీయ వార్తలు

అంత్యక్రియల స్థలంపై వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 7: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు వీలుగా స్థలం కేటాయించాలన్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్‌ను రాష్ట్రప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించే స్థలంపై వివాదం రాజుకుంది. కాగా దివంగత ముఖ్యమంత్రులు సి రాజగోపాలాచారి, కె కామరాజ్ సమాధులు ఉన్న స్మారకస్థూపాల వద్ద స్థలం కేటాయిస్తామని అన్నాడిఎంకె ప్రభుత్వం తెలిపింది. కాగా కరుణానిధికి అన్నాదొరై సమాధి ఉన్న మసోలియం కాంప్లెక్స్ మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించాలని ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయమై స్టాలిన్ ముఖ్యమంత్రి పళిని స్వామిని కలిసి అభ్యర్థించారు. కాగా మెరీనా బీచ్‌కుసంబంధించి కోర్టులో ఉన్న అనేక వివాదాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ స్థలం కేటాయించలేమని ప్రభుత్వం పేర్కొంది. రాజాజీ, కామరాజ్ సమాధులు ఉన్న సర్దార్ పటేల్ రోడ్డులో రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కాగా సిటింగ్ సీఎం కానందు వల్ల కరుణానిధికి మెరీనాబీచ్‌లో స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ఆసక్తిగాలేదని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. మెరీనా బీచ్‌లో ఎంజి రామచంద్రన్, జయలలిత సమాధులు ఉన్నాయి. వీరిద్దరు డీఎంకే అధినేత కరుణానిధికి రాజకీయంగా బద్ధ శత్రువులు. కరుణానిధి సమాధికి మెరీనా బీచ్‌లోనే స్థలం కేటాయించాలని డీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా విఐపిలు కరుణానిధికి నివాళులర్పించే విధంగా రాజాజీ హాల్‌లో భౌతిక కాయాన్ని ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.