జాతీయ వార్తలు

రాజ్యసభ ఎంపీలకు వెంకయ్య క్లాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రాజ్యసభ చర్చలను సీరియస్‌గా తీసుకోకపోవడం, సరిగా హాజరుకాకపోవడంపై రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు సభ్యులను మందలించారు. ప్రతిష్టాకరమైన జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లుపై సోమవారం చర్చ జరిగింది. ఈ బిల్లును సభ ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చ సమయంలో సభ్యులు తక్కువ మంది సభలో ఉన్నారు. మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. రాజ్యసభలో 245 మంది సభ్యులుంటే, కేవలం 156 మంది సభ్యులు హాజరయ్యారని ఆయన చెప్పారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే సమయంలో సగం కంటే ఎక్కువ మంది సభ్యులు సభలో ఉండాలన్నారు. కాని ఈ బిల్లును సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. ఈ బిల్లు చారిత్రాత్మకమైనదన్నారు. ‘ రాజ్యసభలో సభ్యుల సంఖ్య ఎంత ? ఎంత మంది హాజరయ్యారు ? ఒక రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి చర్చ జరిగితే ఇదేనా హాజరయ్యే పద్ధతి ? బిల్లు ఆమోదం పొందింది. కాని చర్చలో సభ్యులు పాల్గొనాలి ’ అని ఆయన అన్నారు. మరి కొంత మంది సభ్యులు హాజరు కాకుండా ఉండి ఉంటే బిల్లు ఆమోదం పొందేది కాదన్నారు. ఇటువంటి సమయాల్లో రాజకీయ పార్టీలు తమ పార్టీ సభ్యులకు విప్‌లను జారీ చేయాలన్నారు. రాజ్యసభ పనితీరు, సభ్యుల హాజరు పట్ల బాధాకరంగా ఉందన్నారు. పార్లమెంటులో ఒక ప్రధానమైన బిల్లు, అంశంపైన చర్చ జరిగే సమయంలో సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైతే, కచ్చితంగా ఆ సమయానికి సభలో ఉండాలన్నారు. సభకు చైర్మన్ వచ్చిన తర్వాత సభ్యులు తాపీగా వస్తున్నారన్నారు. చైర్మన్ రాకముందే సభ్యులు కచ్చితంగా సీట్లలో కూర్చుని ఉండాలన్నారు. దీనివల్ల ప్రజలకు మంచి సందేశం పంపినట్లవుతుందన్నారు. ఐదు నిమిషాల ముందు సభకు వస్తే బాగుంటుందన్నారు. సభ్యులు సభకు ఆలస్యంగా వస్తే ఇతరులకు కూడా భంగం కలిగించినట్లుగా ఉంటుందన్నారు. అలాగే ఒక మంత్రి తరఫున మరో మంత్రి ప్రకటన చేసే విధానాన్ని కూడా తాను అనుమతించనని చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ముందుగా ప్రకటన విషయమై మంత్రి తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇకపై తాను ఈ తరహా సర్దుబాట్లను అనుమతించనని ఆయన స్పష్టం చేశారు.