జాతీయ వార్తలు

మేరునగ ధీరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: దశాబ్దాల పాటు తమిళనాడును భిన్న రంగాల్లో అద్వితీయమైన రీతిలో ప్రభావితం చేసిన నిరుపమాన రచయిత, సాహితీవేత్త, రాజకీయ నాయకుడు ఎమ్.కరుణానిధి. వైఫల్యాలను ఎదురొడ్డి తనదైన శైలిలో తమిళనాడు రాజకీయ యవనికనే మార్చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కరుణానిధి నిష్క్రమణతో ఓ అరుదైన, ఘనమైన శకమే అస్తమించింది. ఉద్యమమేదైనా ఉత్తుంగ తరంగంలా ఉద్యమించిన కరుణానిది అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని తన రాజకీయ, సైద్ధాంతిక పటిమకు పదును పెట్టుకున్నారు. వర్తమాన వ్యవస్థలోని లోపాల్ని ఎండగట్టి..అప్పటి సామాజిక పెత్తందారీతనాన్ని ధిక్కరించి ధీరత్వాన్ని ప్రదర్శించిన నాయకత్వం కూడా ఆయనదే. అలాంటి రచయిత, రాజకీయ వ్యూహకర్త, జనాన్ని అద్వితీయ రీతిలో మెప్పించిన నాయకుడు అతి అరుదేననడం అతిశయోక్తి కాదు. పదోతరగతి ఫెయిలయిన ఆయన తన జీవితంలో వైఫల్యమే లేని రీతిలో అన్ని రంగాల్లోనూ రాణించారు. అద్వితీయ సమర్థతతో అన్ని వర్గాల్ని మెప్పించి తన సవ్వసాచిత్వాన్ని నిరూపించుకున్నారు. సినీ రచయితగా కరుణానిధి కలం పడితే పరుగులు పెట్టే పదాల పరంపర తమిళనాట ఉద్వేగానే్న రేపింది. సినీ రచనకు సైద్ధాంతిక పదును పెట్టి ఆయన రాసిన కథలు, సంభాషణలు దశాబ్దాల పాటు ప్రజానీకంపై గాఢమైన ప్రభావానే్న కనబరిచాయి. పెరియార్ శిష్యుడిగా పేరొందిన కరుణానిధి ఆయన సిద్ధాంతాల పరివ్యాప్తికి అనేక కోణాల్లో పాటుపడ్డారు. రాజకీయాల్లోకి రాకముందు నాటకాలకు స్క్రిప్ట్‌లు రాయడం మొదలు పెట్టిన ఆయన తనదైన వాక్పటిపతో పెరియార్ రామస్వామిని ఎంతగానో ఆకర్షించి ఆయన అనుంగు శిష్యుడయ్యారు. అంతే కాదు పార్టీ పత్రిక ద్రవిడ కజగంకు సంపాదకత్వ బాధ్యతనూ కరుణానినిధి అప్పగించారు. అనంతర పరిణామాల నేపథ్యంలో ద్రవిడ కజగం రెండు ముక్కలు కావడంతో అన్నాదురై వర్గంలో చేరిన కరుణానిధి ద్రవిడ మునే్నట్ర కజగం ఏర్పాటులోనూ కీలక భూమిక పోషించారు. 50 దశకంలో సినీ రచయితగా కరుణానిధి తనదై ముద్ర వేశారు. నాటకాల రచనకు స్వస్తి పలికి సీనిరంగంలోకి అడుగు పెట్టిన ఆయన అనంతర కాలంలో సినీ రచయితగా తిరుగులేని స్థాయికి చేరుకున్నారు. మొదటి నుంచీ తమిళనాడు రాజకీయాలకూ, సినిమాలకూ అవినాభాశ సంబంధం ఉండటం కూడా ఇటు రాజకీయంగా తన పార్టీ సిద్ధాంతాల పరివ్యాప్తికి సినీ రచనా వ్యాసంగం కరుణానిధికి ఎంతగానో దోహదం చేసింది. రాజకీయ సమీకరణలకు సినిమా అన్నది ఆయనకు బలమైన వేదికగా మారింది. దక్షిణ భారతంలో బ్రాహ్మణేతరులు ఎదగాలన్న డిఎంకె సిద్ధాంతానికి ఆ పార్టీ సినీ ప్రమేయం బలమైన మూలంగా పనిచేసింది. సామాజిక సంస్కరణలకు అన్నాదురై ఎన్నో రచనలు చేసినట్టుగానే కరుణానిధి ఆయన బాటలోనే ముందుకెళ్లి పరాశక్తి అనే చిత్రంతో తిరుగులేని గుర్తింపును రచయితగా సంతరించుకున్నారు. హిందీ వ్యతిరేకతతో సహా అనంతరం జరిగిన అనేక ఉద్యమాలు కరుణానిధి రాజకీయ జీవితానికి పునాదివేశాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో తొలి కాంగ్రెసేతర పార్టీగా డిఎంకె అధికారంలోకి వచ్చి అన్నాదురై ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకూ కూడా తమిళనాట ద్రవిడ రాజకీయాలే సాగాయి తప్ప కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాలేదు. అన్నాదురై మరణానంతరం పార్టీలో చీలిక రావడంతో దాన్ని అవకాశంగా తీసుకున్న కరుణానిధి తన బలాన్ని మరింత పెంచుకుని నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి దాదాపు 20ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగారు.70దశకంలో అప్పటి ప్రసిద్ధ నటుడు ఎమ్‌జి రామచంద్రన్‌తో విభేదాలు ఆవడం..ఆ పరిణామాలు అన్నాడిఎంకె ఆవిర్భావానికి దారితీశాయి. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎమ్‌జిఆర్ సారథ్యంలోని అన్నాడిఎంకె ఘన విజయం సాధించడం, డిఎంకె ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎమ్‌జిఆర్ బతికున్నంత వరకూ తమిళనాడులో డిఎంకె అధికారంలోకి రాలేదు. అప్పటి నుంచి నేటి వరకూ తమిళ రాజకీయాలూ అన్నాడిఎంకె, డిఎంకెల మధ్యే తిరుగుతూ వచ్చాయే తప్ప ఏ జాతీయ పార్టీకి అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశమే లేకపోయింది. రాజకీయాల్లో జయాపజయాలు సహజమే అయినా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణించడంలో దిట్టగా పేరొందిన కరుణానిధి మరణం..అదీ అన్నాడిఎంకె అధినేతి జయలలిత మరణించిన కొన్ని నెలల వ్యవధిలోనే జరగడం తమిళనాట ఒక రకంగా చుక్కాని లేని రాజకీయ వ్యవస్థకు ఆజ్యం పోసేదేనన్న సంకేతాలూ వినిపిస్తున్నాయి. ఇటు రాజకీయంగానూ, అటు సినీ రంగంలోనూ కరుణానిధి లేని లోటు పూడ్చలేనిదే.