జాతీయ వార్తలు

పోలీసుల ఆధీనంలో ఢిల్లీ మెట్రో, విమానాశ్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ఢిల్లీమెట్రో, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సీఐఎస్‌ఏఫ్ పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రయాణీకుల కదలికలపై నిఘాను పెంచారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రవేశించే ప్రయాణీకులను రెండు సార్లు తనిఖీ చేస్తున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజిజయన్‌లో 210 స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లను భద్రతా బలగాలను మోహరించారు. విమానాశ్రయాల్లో కూడా తనిఖీలను ముమ్మరం చేశారు. ఉగ్రవాదులు చొరబడి హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర నిఘా ఏజన్సీలను దేశంలోని అన్ని రాష్ట్రాలను హెచ్చరించాయి. దాదాపు 500 మంది సీఐఎస్‌ఎఫ్ బలగాలను ప్రత్యేక భద్రత నిమిత్తం నియమించినట్లు డీఐజీ రఘుబీర్ లాల్ చెప్పారు. 5వేల సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షించేందుకు కొత్త కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.జనం రద్దీగా ఉంటే చోట అనుమానస్పద వ్యక్తుల రాకపోకలను గమనించేందుకు నిఘా సిబ్బందిని నియమించారు. విమానాశ్రయం లోపల, వెలుపల పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించా య. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సమయంలో ఉగ్రవాద శక్తులు పేట్రేగి పోకుండా భద్రతాపరమైన చర్యలను పోలీసు విభాగాల మధ్య సమన్వయంతో తీసుకుంటున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.