జాతీయ వార్తలు

ముజఫర్‌పూర్ ఘటనలో నిందితులను వదలం : రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ముజఫర్ ఘటనలో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తిలేదని, ఈ ఉదంతంపై బీహార్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఆయన లోక్‌సభలో వెల్లడించారు. లోక్‌సభలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కేసులో రాష్ట్రప్రభుత్వం వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేసిందన్నారు. జిల్లా పరిపాలనాధికారిని సస్పెండ్ చేశారని, ఆశ్రమం మేనేజర్, మరొకరిని కూడా అరెస్టు చేశారన్నారు. అదనపుచీఫ్ సెక్రటరీ, డీజీపీ స్థాయి పోలీసు అధికారి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చర్చ తర్వాత విపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అధికార, విపక్ష పార్టీ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్పీకర్ సుమిత్రామహజన్ మాట్లాడుతూ ఈ ఘటనపై రాజకీయం చేయడం తగదన్నారు. ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలోని బాలికల శరణాలయాల కార్యకలాపాలను తెలుసుకోవాలని కోరారు. ఈ చర్చ లో ఎస్పీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్, ఆర్జేడీ సభ్యుడు జై ప్రకాశ్ నారాయణ్ యా దవ్, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే, బీజేపీ ఎంపీ కల్‌రాజ్ మిశ్రా పాల్గొన్నారు.