జాతీయ వార్తలు

ఎమ్మెల్యే లాడ్ నిధులు రూ.10కోట్లకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం సంవత్సరానికి ఎమ్మెల్యేకు ఇచ్చే 4 కోట్ల రూపాయల నిధులను 10 కోట్లకు పెంచుతూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం శాసనసభలో ప్రకటించారు. లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ (లాడ్) నిధులను పెంచాలని చాలా రోజులుగా శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
వారి డిమాండ్ మేరకే 4కోట్లను 10 కోట్లకు పెంచుతున్నట్లు సిసోడియా తెలిపారు. ఈ నిధులను ఆయా నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేసేందుకు ఆ ఎమ్మెల్యేకు పూర్తి అధికారం ఉంటుంది. నిధులను ఖర్చుచేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు జారీచేస్తుందని ఆయన వివరించారు. ఈ ఏడాది నుంచే నిధులను పెంచనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. అలాగే ఢిల్లీలో ఫారెన్ లాంగ్వేజ్ అకాడెమీని ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్ నిర్ణయించిందని, విదేశీ భాషలతోపాటు తెలుగు, కాశ్మీరీ, మలయాళం, గుజరాతీ తదితర భాషలు కూడా ఈ అకాడమీలో నేర్పుతారని సిసోడియా వివరించారు.