జాతీయ వార్తలు

కేంద్రానిది ద్వంద్వనీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రాకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకుండా ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని శ్రీనివాస్ ప్రస్తావించారు. ప్రత్యేక రైల్వే జోన్‌కోసం ఆంధ్రులు గత ముప్పై సంవత్సరాల నుండి పోరాడుతున్నారనే విషయాన్ని మరిచిపోరాదని ఆయన అన్నారు. రైల్వే జోన్ అంశంపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ ఏపీకి రైల్వే జోన్ ఇచ్చి తీరుతామని ప్రకటిస్తే, కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని ప్రకటించింది. ఇందులో ఏది నిజం అని అవంతి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాన మోదీ విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విశాఖపట్నం బీజేపీ ఎంపీ కూడా ప్రత్యేక రైల్వే జోన్ వచ్చి తీరుతుందని చెప్పారు. కాబట్టి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా ప్రత్యేక జోన్ ఏర్పాటును ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయి. మంచి రాబడి కూడా ఉంటుందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామంటూ విభజన చట్టంలో ఇచ్చిన హామీని కూడా అమలు చేయరా? ఏపీకి ఎందుకింత అన్యాయం చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలుగుదేశం ఎంపీలు ఎంత డిమాండ్ చేసినా అవంతి శ్రీనివాస్ ప్రసంగంపై స్పందించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవటంతో వారు సభనుండి వాకౌట్ చేశారు. అంతకుముందు టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ గొడవ చేశారు