జాతీయ వార్తలు

ఓబీసీ కోటాకు ఢోకా లేదు : ఫడ్నవీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 7: ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాలు వారికే తప్ప మరొక వర్గానికి కేటాయించబోమని మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్నవిస్ స్పష్టంచేశారు. ఉద్యోగాలు, విద్యలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఓబీసీలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే రాష్ట్ర జనాభాలో 52 శాతం మంది ఉన్న ఓబీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓబీసీలకు 17 శాతం కోటా నడుస్తోంది. వాటిని 19 శాతానికి పెంచాలని అడుగుతున్నారు. కాగా ఉద్యోగాల్లో ఓబీసీల కోటా పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తామన్నారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి దానికి స్పష్టమైన గడువుఅంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ తృతీయ జాతీయ మహాసభల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ‘ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాలు వారికే చెందుతాయి. మరొక వర్గానికి బదిలీ చేసే ప్రసక్తి ఎంత మాత్రం లేదు. ఓబీసీలకు కేటాయించిన సీట్లు వారికే దక్కుతాయి’అని ఆయన పునరుద్ఘాటించారు. మహారాష్ట్రంలో ప్రస్తుతం ఓబీసీలకు 17 శాతం కోటా అమలవుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మరాఠాలు రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది ఉన్నారు. ఓబీసీ కేటగిరి కింద ఉద్యోగాలు, విద్యలో ప్రత్యేక కోటా ఇవ్వాలంటూ మరాఠాలు ఉద్యమబాట పట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీలకు 13, ఎస్టీలకు 7, ఓబీసీలకు 19, మిగతా వర్గాలకు 13 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.