జాతీయ వార్తలు

లెక్కలు చెప్పకపోతే నిధులివ్వలేం : చౌబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగ ధ్రువపత్రాలు (యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు) సమర్పించనందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నిధులు విడుదల చేయలేకపోతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు. రాజ్యసభలో మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చౌబే ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సులు ప్రవేశపెట్టి, సీట్లు పెంచడానికి వీలుగా ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎంపిక చేశారు. వాటిలో ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం, గుంటూరు మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, ఎస్వీ మెడికల్ కాలేజీ, తిరుపతి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, అనంతపురం ఉన్నట్టు వెల్లడించారు. 2016-17, 2018-19 సంవత్సరాలకుగాను రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వౌలిక వసతులను పటిష్టపరచి అప్‌గ్రేడ్ చేసేందుకు కేంద్ర సాయం కింద రెండేళ్లలో మొత్తం రూ.81కోట్లు విడుదల చేసినట్టు మంత్రి చెప్పారు. అయితే జీఎఫ్‌ఆర్ నిబంధన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిధులకు సంబంధించి వినియోగ ధ్రువపత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే తదుపరి నిధుల విడుదల సాధ్యమవుతుందన్నారు. మరోవైపు 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను (టర్మ్స్ ఆఫ్ రెఫరెనె్సస్) మార్చే ప్రసక్తే లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి.రాధాకృష్ణన్ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. ఏ అధారిటీకైనా విధి విధానాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం సిఫార్సు చేయబోదని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా నిర్ధారణ కోసం 15 ఆర్థిక సంఘం 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల ఏపీ రూ.24,340కోట్ల మేర నష్టపోయే అవకాశం ఉన్న విషయం వాస్తవమేనా? అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంఘం విధివిధానాల్లో మార్పులు చేయాలని కేంద్ర ఫ్రభుత్వం సిఫార్సు చేసే అవకాశం ఉందా అని విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
కొత్తపల్లి గీతపై వేటు వేయండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి స్పీకర్‌కు లేఖ రాశారు.
ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వం
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతునివ్వమని వైఎస్సాఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలం చెందిందని, విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.