జాతీయ వార్తలు
ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే : దేవెగౌడ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 August 2018
న్యూఢిల్లీ, ఆగస్టు 7: సామాజక న్యాయాన్ని కోరుకునే వ్యక్తిగా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఎప్పుడూ అనుకుంటానని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణకు దళిత సంఘాల నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న మూడు రోజుల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ స్ఫూర్తితోనే అట్రాసిటీ చట్ట రక్షణ ఉద్యమం బలంగా నడుస్తోందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న మాదిగలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ, జేబీ రాజు, జీ చెన్నయ్య, బెల్లయ్య నాయక్, అద్దంకి దయకర్ పాల్గొన్నారు.