జాతీయ వార్తలు

పౌర రిజిస్ట్రేషన్‌పై రాజ్యసభలో రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అసోం జాతీయ పౌర రిజిస్ట్రేషన్ అంశంపై రాజ్యసభలో త్రుణముల్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగి సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగించడంతో చైర్మన్ సభను వాయిదా వేయక తప్పలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, కనీస మద్దతు ధర, ఖరీఫ్ పంటలకు ఉద్దేశించబడిన స్వల్పకాలిక చర్చను చైర్మన్ వెంకయ్య నాయుడు చేపట్టారు.
ఆ సమయంలో జాతీయ పౌర రిజస్ట్రేషన్ అంశంపై చర్చ చేపట్టాలని తృణముల్ సభ్యులు కోరగా చైర్మన్ తిరస్కరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన చర్చను ప్రారంభిస్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అవకాశం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఏన్డీఏ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, కేటాయింపులు తదితర అంశాలపై అమిత్ షా ఐదు నిమిషాలపాటు ప్రసంగించారు. ఆ సమయంలో తృణముల్ ఎంపీలు అసోం జాతీయ పౌర రిజస్ట్రేషన్ అంశంపై చర్చను చేపట్టాలని పోడియం చుట్టిముట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. చైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తర్వాత కూడా తృణమూల్ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
మరోవైపు ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే జీరో అవర్‌లో ఉత్తరప్రదేశ్‌లో డియోరియాలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్‌సింగ్ లేవనేత్తారు. ఎస్పీ సభ్యులు కూడా అదే అంశంపై తమ స్థానాల్లో నిలబడి గొడవ చేయడంతో సభను మధ్యాహ్న 12 గంటకలకు వాయిదా వేశారు. అనంతరం ప్రశ్నోత్తారాల సమయం కొనసాగింది.