జాతీయ వార్తలు

నిష్పక్షపాతంగా విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: జమ్మూలో తన నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌తో ఆయన భేటీ అయ్యారు. గత వారం తన నివాసం వద్ద జరిగిన భద్రత ఉల్లంఘన, యువకుడి మృతిపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ ఘటనపై మీడియా, బాధితుడి కుటుంబ సభ్యులు నుంచి భిన్నకథనాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిస్పక్షపాత విచారం జరిపించాలని రాజ్‌నాథ్‌కు స్పష్టం చేశారు. హోమ్‌మంత్రితో సమావేశం ముగిసిన తరువాత ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ పూర్తి భద్రత ఉన్న తన నివాసం వద్ద ఈ ఘటన జరగడం బాధకరమని అన్నారు. శనివారం రాత్రి జమ్మూ శివార్లలోని భటిండిలోలోని ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా నివాసం వద్ద సయ్యద్ ముర్ఫాద్ ఎక్స్‌యూవీ కారుతో కలకలం సృష్టించాడు. భద్రతావలయా న్న ఛేదించుకుని వచ్చి వాహనంతో గేట్‌నుకు గుద్దుకుని మరీ లోపలికి వచ్చేశాడు. వేగంగా కారు నడపుకొచ్చిన సయ్యద్ భద్రతాదళాలపై పెనుగులాటకు దిగాడన్నారు.