జాతీయ వార్తలు

‘రాఫెల్’పై జీపీసీకి కాంగ్రెస్ పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం లోక్‌సభలో పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఎంపీలు పోడియం వద్దకు వచ్చి రాఫెల్ డీల్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. తక్షణం దర్యాప్తునకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీలు దాదాపు గంట పాటు పోడియం వద్ద నిలబడి రాఫెల్ డీల్‌పై నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సావధాన తీర్మానాల కార్యక్రమం చేపట్టి పలువురు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘మీరు ఇలా ప్రతి రోజు గొడవ చేయటం బాగా లేదు’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులు చాలాసేపు సభ దద్దరిల్లేలా నినాదాలు ఇస్తూనే ఉన్నారు.
కాగా రాఫెల్ డీల్ కుంభకోణంపై జేపీసీ దర్యాప్తుకు ఆదేశించాలంటూ సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఎంపీలు ప్లకార్డులతో ధర్నాలో పాల్గొన్నారు. రాఫెల్ డీల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోనియా గాంధీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటం గమనార్హం.

చిత్రం..పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష సభ్యులతో ధర్నాలో పాల్గొన్న సోనియాగాంధీ