జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు అమాయకులు మృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫుల్‌బానీ (ఒడిశా), జూలై 9: మావోయిస్టులు, భద్రతాదళాల ఎదురుకాల్పుల ఘటన ఆరుగురు గ్రామస్థులను బలితీసుకుంది. ఇద్దరు మహిళలు, ఒక బాలుడు సహా కాల్పుల్లో మృతి చెందారు. ఒడిశాలోని కంధామల్ జిల్లా గుముత్‌మహాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కంధామల్ ఎస్పీ పినాక్ మిశ్రా కథనం ప్రకారం మావోయిస్టులు కదలికపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. సిఆర్‌పిఎఫ్, ఎస్‌ఓజి, డివిఎఫ్ పోలీసులు కూంబింగ్‌లో పాల్గొన్నారు. మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో పలువురు గ్రామస్థులు ఆటోరిక్షాలో ఆ మార్గం గుండా వెళ్తున్నారు. దురదృష్టవశాత్తూ ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు కాల్పులతో మృతి చెందారని సమాచారం అందినట్టు ఎస్‌పి తెలిపారు. ఎదురుకాల్పులు జరిగినచోటు మారుమూల అటవీ ప్రాంతం కావడంతో పూర్తి వివరాలు తెలియరాలేదని ఆయన అన్నారు. ఇద్దరు మహిళలు, 13ఏళ్ల బాలుడు, ముగ్గురు పురుషులు మృతి చెందినట్టు ఆయన వెల్లడించారు. వాహనంలోని మరో ముగ్గురు గాయపడ్డారు. ఇలాఉండగా ఈ సంఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయగడ-్ఫల్‌బానీ హైవేను దిగ్బంధించారు. ఎన్‌కౌంటర్‌లో అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.