జాతీయ వార్తలు

నెహ్రూ పండితుడేమీ కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 11: భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పండితుడేమీ కాదని, ఆయన గొడ్డు మాంసం, పంది మాంసం తిన్నారని రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహూజా వ్యాఖ్యానించారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతున్న ఈ ఎమ్మెల్యే రాజస్తాన్ రాష్ట్రం, అల్వార్ జిల్లా, రామ్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జ్ఞాన్‌దేవ్ అహూజా ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నెహ్రూ, గాంధీ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక దుష్ప్రభావాలకు ఆద్యులని ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పండితుడేమీ కాదని, కాంగ్రెస్ వాళ్లే అతని పేరుకు ముందు 3పండిట్2 అని తగిలించారని ఆయన వ్యాఖ్యానించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శించడాన్ని తన నాన్నమ్మ, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచే నేర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలెట్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహూజా పైవిధంగా అన్నారు. గాంధీ వారసుడు ఎప్పడూ ఇందిరా గాంధీతో ఆలయాలను సందర్శించలేదని పేర్కొన్నారు. తాను చేస్తున్న వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని, తన ఆరోపణలు తప్పు అని ఎవరైనా నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

చిత్రం..రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహూజా