జాతీయ వార్తలు

వంద స్థానాల్లో పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశ వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో వంద లోక్‌సభ సీట్లలో పోటీ చేయాలనే లక్ష్యంతో ఆప్ ఆద్మీ పార్టీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆప్ పార్టీ నిర్ణయించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ 400 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. అన్ని సీట్లలో పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. బీహార్, పంజాబ్, హర్యానాలో పార్టీని పటిష్టం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో పాగావేసేందుకు ఇప్పటి నుంచి బూత్ స్థాయి నుంచి కృషి చేస్తున్నట్లు చెప్పరు. యుపీలో కనీసం 15 సీట్లలో పోటీ చేస్తామన్నారు. ఢిల్లీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. స్థానిక కేడర్‌కు శిక్షణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. కాగా రెండు సీట్లు న్యూఢిల్లీ, పశ్చిమఢిల్లీ లోక్‌సభ సీట్లకు అభ్యర్థిత్వాలను కాంగ్రెస్‌తో పొత్తు విషయమై తేలిన తర్వాత ఖరారు చేస్తామన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 4 సీట్లను గెలిచిందన్నారు. ఈ సారి ఎక్కువ సీట్లలో గెలుస్తామన్నారు. గుజరాత్‌లో కూడా తమ పార్టీ బలోపేతం చేశామన్నారు. హర్యానాలో ఒక సీటు గెలిచేందుకు కసరత్తు చేస్తునాన్మన్నారు. దిగువ స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తామన్నారు.