జాతీయ వార్తలు

త్వరలో ఇస్రో టీవీ చానెల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 12: ప్రజల్లో శాస్తస్రాంకేతిక అంశాల పట్ల అవగాహన పెంచడంతోపాటు పాఠశాలల విద్యార్థులకు శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రత్యేకంగా ఒక టీవీ చానెల్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశంలో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై సామర్ధ్య పరీక్షలు నిర్వహించడం వల్ల సామాన్య జనంలో ఆయా అంశాలపై మరింత అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్టు ఇస్రో చీఫ్ కె.శివన్ ఆదివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. తమ అంతరిక్ష పరిశోధన సంస్థ ఏజన్సీ మరో 25-30 రోజుల్లో శిక్షణ శిబిరాల నిర్వహణకు వీలుగా విద్యార్థులను ఎంపిక చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ సమయంలో విద్యార్థులు లేబొరేటరీలతోపాటు తాము తయారుచేసే చిన్నతరహా సెటిలైట్లను సందర్శించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ‘సైన్స్‌కు సంబంధించిన మనకు ఇంతవరకు ఎలాంటి టీవీ చానెల్ లేదు. అందువల్ల ఇస్రో టీవీ చానెల్‌ను ప్రారంభించడం ద్వారా శాస్త్ర సాంకేతిక అంశాలపై మ రింత విస్తృత ప్రచారం చేయవచ్చు. ఇది ప్రజల్లో ఆయా అంశాలపై అవగాహనకు తోడ్పడుతుంది’ అని ఆయన అన్నారు. ఇందుకు వీలుగా అంతరిక్ష టెక్నాలజీ రంగంలో వచ్చే ఆలోచనలను కలగలిపిన స్టార్టప్‌లతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధ్ఫిలాలు వినియోగించుకునేందుకు తెలివితేటలకు పదును పెట్టాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు.