జాతీయ వార్తలు

భూగర్భ జలాలు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: భూగర్భ జలాలు బ్యాంకుల్లో దాచుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సమానమని, తప్పనిసరి పరిస్థితుల్లోనే వీటిని వినియోగించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వానికి సూచించింది. భూగర్భ జలాలను వివిధ రకాల పేరిట ఎడాపెడా వినియోగిస్తుండడం వల్ల భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం కూడా మంచినీటిని ప్యాకేజి రూపంలో అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తోందని పేర్కొంది. నీటి వనరుల లభ్యత, సమాజంలో దాని ప్రభావంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొద్దిరోజుల కిందట నివేదిక రూపొందించింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వస్తున్న డిమాండ్‌పై, నీటి వినియోగంపై ప్రభుత్వం సామాజిక బాధ్యతగా గుర్తించి వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ప్రజలకు సురక్షిత, శుభ్రమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కీలక బాధ్యత పోషించాలని పేర్కొంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటిని వినియోగించుకునేందుకుగాను భూగర్భ జలాలను ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా పరిగణించడం ఎంతో అవసరమని తెలిపింది.