జాతీయ వార్తలు

సమాచారం ఎందుకివ్వరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద అడిగిన సమాచారాన్ని పిటిషన్‌దారుడికి ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)ను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) నిలదీసింది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే, ఏకపక్ష నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. అసోంలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌పై అప్పటి సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రజనీష్ రాయ్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ఓ జర్నలిస్టు ఆర్‌టీఐ కింద చేసుకున్న దరఖాస్తును ఎంహెచ్‌ఏ తిరస్కరించడాన్ని సీఐసీ తప్పుపట్టింది. కేసు వివరాల్లోకి వెళితే, 2017 మార్చిలో అసోంలోని చిరాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. నిషిద్ధ ఎన్‌డీఎఫ్‌బీ (ఎస్) కార్యకర్తలన్న అనుమానంతో అసోం పోలీసులు ఇద్దరు వ్యక్తులను కాల్చిచంపారు. అయితే, అది బూటకపు ఎన్‌కౌంటరని, నిజానికి వారు నిర్దోషులనీ పేర్కొంటూ రజనీష్ రాయ్ సీఆర్‌పీఎఫ్‌కు ఒక నివేదిక ఇచ్చారు. దీనిపై వివరాలు తెలపాల్సిందిగా ఓ జర్నలిస్టు జర్నలిస్టు దాఖలు చేసిన అభ్యర్థనను సీఆర్‌పీఎఫ్ తిరస్కరించింది. ఆర్‌టీఐ ద్వారా సమాచారాన్ని కోరినప్పటికీ, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పేర్కొంటూ ఎంహెచ్‌ఏ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ సంఘటనలపై సీఐసీ తీవ్రంగా స్పందించింది. రజనీష్ రాయ్ నివేదిక ఇచ్చింది వాస్తవమా? కాదా?, ఎన్‌కౌంటర్ జరిగిందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఏ విధంగా దేశ భద్రతకు విఘాతం కలిగిస్తుందో తెలపాలని ఎంహెచ్‌ఏను నిలదీసింది. వివరాలు సమర్పించకపోతే, ఏకపక్ష నిర్ణయం తీసుకోక తప్పదని హెచ్చరించింది.