జాతీయ వార్తలు

అనుమతించిన వేగంతోనే నడపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న సమయంలో నిర్ణీత వ్యవధలోపల గమ్యానికి చేరుకునేందుకు గరిష్టస్థాయిలో అనుమతించిన వేగంతోనే రైళ్లను నడపాలని రైల్వే శాఖ డ్రైవర్లను ఆదేశించింది. అంతేకాని అనుమతించిన వేగం కంటే ఎక్కువ వేగంతో రైళ్లను నడపరాదని రైల్వే శాఖ డ్రైవర్లను ఆదేశించింది. రైళ్లు సకాలంలో నడుస్తున్నా, గరిష్ట స్థాయిలో అనుమతించిన పరిమితివేగంలోనే రైళ్లను నడపాలని రైల్వేశాఖ 2000లో ఆదేశాలు ఇచ్చింది. కాగా ఆ ఆదేశాలను మార్చుతూ ఆలస్యంగా నడుస్తున్న సమయంలో కూడా అనుమతించిన వేగంలోనే రైళ్లను నడుపాలని కోరింది. ఆగస్టు 15వ తేదీన కొత్త టైంటేబిల్‌ను విడుదల చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇందులో రైళ్ల వేగం, మార్పులను కూడా పేర్కొన్నారు.