జాతీయ వార్తలు

కోతకు గురవుతున్న కోస్తా తీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: తుపానులు, ప్రకృతివైపరీత్యాల వల్ల దేశంలోని కోస్తా తీరంలో 33 శాతం భూభాగం కోతకు గురవుతోంది. అదే సమయంలో 29 శాతం మేర సముద్ర తీరం, నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో ఇసుక మేటలు వేస్తున్నాయి. సముద్ర తీరం వెంట ఎడాపెడా సాగుతున్న అక్రమ నిర్మాణాల వల్ల కూడా కోస్తా తీరం వెంట భూభాగం కోతలకు గురవుతోంది. గత 26 సంవత్సరాలుగా కోస్తా తీరంపై నేషనల్ సెంటర్ ఫర్ కోస్టర్ రీసెర్చి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎంవీ రమణ మూర్తి చెప్పారు. భారత్‌కు ఉన్న 7517 కి.మీ కోస్తా తీరంలో 6031 కి.మీ మేర సర్వే నిర్వహింరు. 33 శాతం మేర కోస్తా తీరం వెంట కోతకు గురైందని రమణ మూర్తి చెప్పారు. ఎక్కువ కోతకు గురైన రాష్ట్రం పశ్చిమబెంగాల్. తీరం వెంట భూభాగం కోతకు గురైతే, అంతేసమానంగా ఆ వెనక ప్రాంతంలో ఇసుక మేటలు వేస్తాయి. తమ సర్వేలో 2156.43 కి.మీ తీరం కోతకు గురైందని, అంతే భాగంలో 1941.24 కి.మీ పొడువున ఇసుక మేటలు వేసింది. తీరం వెంట భూభాగం కోతకు గురికావడం, ఇసుక మేటలు వేయడంపై డాక్యుమెంటేషన్ చేస్తున్నామన్నారు. దీని వల్ల తీర ప్రాంతాన్ని రక్షించేందుకు వీలవుతుందని ఎర్త్‌సైనె్సస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎంరాజీవన్ చెప్పారు. కోతలు పెరగడం వల్ల మానవ ఆవాసాల ప్రాంతానికి నష్టం సంభవిస్తుందన్నారు. గతంలో తీర ప్రాంతం నుంచే మత్స్యకారులు చిన్న నావల్లో సముద్రంలోకి చేపలు పట్టేందుకువెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితిలేదు. మత్స్యకారులు హార్బర్‌కు వెళ్లి చేపల వేటకు వెళ్లాల్సి వస్తోంది. మడ అడవులు ఉన్న ప్రాంతాలు, ఉప్పుటేరుల వద్ద ఇసుక మేటలు వేస్తే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అదే బీచ్‌ల వల్ల ఇసుక మేటలు వేస్తే భూ భాగం పెరుగుతుంది. మడ అడవులు, ఉప్పుటేరు ప్రాంతాల్లో అనేక జల చరాలు జీవిస్తాయి. ఇందొ క అందమైన ప్రాంతం, కాని కోతల వల్ల, ఇసుక దిబ్బల వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. పశ్చిమబెంగాల్‌లో 63 శాతం తీర ప్రాం తం కోతకు గురవుతోంది. దీంతో 26 ఏళ్లలో 96 చ.కిమీ భూభాగాన్ని కోల్పోయామన్నారు. పాండిచ్ఛేరిలో 57శాతం భూభాగం, ఒరిస్సాలో 28, ఆంధ్రాలో 27శాతం తీర ప్రాంతం కోతకు గురైంది. పశ్చిమ తీరంలో కేరళలో 40 శాతం తీర ప్రాంతం కోతకు గురైంది. గుజరాత్ తీర ప్రాంతం 26 శాతం, మహారాష్టల్రో 24, గోవాలో 12 శాతం కోతకు గురైంది. కాగా ఆంధ్ర, ఒడిశాలో తీర ప్రాం తంలో గరిష్ట స్థాయిలో ఇసుక మేటలువేసింది. ఆంధ్రాలో 42 శాతం, ఒడిశాలో 51 శాతం ఇసుక మేటలు వేసింది. పశ్చిమబెంగాల్‌లో 24 శాతం, గుజరాత్‌లో 31, మహారాష్టల్రో 12, గోవాలో 20, కర్నాటకలో 30, కేరళలో 21, తమిళనాడులో 23 శాతం ఇసుక మేటలు వేసింది. దేశంలో 10 రాష్ట్రా ల్లో 66 జిల్లాల్లో సర్వే చేసి 526 మ్యాపులు తయా రు చేశారు. ఐదు శాటిలైట్ల ద్వారా ఉపగ్రహ చా యా చిత్రాలను రూపొందించారు. కోతల వల్ల అ లలు, కెరటాలు దిశను మార్చుకుంటాయి. కెరటాల తీవ్రత పెరుగుతుంది. తుపానులు, అల్పపీడనాలతో భారీ వర్షాలు కురిసి నదీ జలాలు సముద్రంలో కలుస్తాయి. దీని వల్ల ఇసుక మేటలు పెరిగి సముద్ర నీటి మట్టం పెరుగుతుంది. అరేబియా స ముద్రంతో పోల్చితే బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.