జాతీయ వార్తలు

కాంగ్రెస్‌ను ఏకాకిని చేస్తే బీజేపీకే లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ చోటు లేకుండా పొత్తు పెట్టుకునే పార్టీల కూటమి వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ హెచ్చరించారు. బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంపై ఆయన స్పందించారు. ఈ తరహా ప్రయోగాలు విఫలమవుతాయని, కాంగ్రెస్‌ను ఏకాకిగా చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ గెలుపుకు దోహదపడినట్లవుతుందన్నారు. ఎన్నికల తర్వాత విపక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో అనే దానిపై చర్చ ఇప్పుడే వద్దని, బీజేపీని ఓడించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్న కాంగ్రెస్ పిలుపును గౌరవించాలన్నారు. ఇదే విషయాన్ని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలాసార్లు స్పష్టం చేశారన్నారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేసిన సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ, బీజేపీని ఎదుర్కొనాలంటే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడాలన్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల నుంచి కాంగ్రెస్ యూపీలో బలపడిందన్నారు. పెద్ద నగరాల్లో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉందన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేస్తే 12 శాతం ఓట్లు పోలవుతాయన్నారు. అదే కూటమిలో ఉంటే ఏడు శాతం ఓట్లు వస్తాయన్నారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే బీజేపీని మట్టికరిపించవచ్చన్నారు. కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. ఎఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన తర్వాత పార్టీ సంస్థాగతంగా అనేక మార్పులకు లోనైందని, పార్టీ పటిష్టమవుతోందన్నారు. ప్రజల్లో రాహుల్ గాంధీ ఇమేజి పెరిగిందన్నారు. బీజేపీని వ్యతిరేకించే ఓటు కాంగ్రెస్‌కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. బీజేపీని ఓడించడం ఒక్కటే కాంగ్రెస్ అజెండా అని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పుడు చర్చ అప్రస్తుతమన్నారు.