జాతీయ వార్తలు

మహిళలే ఉత్తమ మేనేజర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగడ్, ఆగస్టు 12: మహిళలు గృహ రంగంలోనే కాకుండా, అన్ని విభాగాల్లో ఉత్తమ మేనేజర్లుగా రాణిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. మహిళలకు మేనేజిమెంట్‌లో ఉన్నత స్థాయి డిగ్రీ లేకపోవచ్చని, కాని ఇంటా బయట ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలను అన్ని రంగాల్లో భాగస్వాములను చేయాలన్నారు. మహిళా సాధికారత లేకుండా ఏ సమాజం ప్రగతి మార్గంలో పయనించలేదన్నారు. మహిళలు ఇంట్లో పనిచేస్తారని, ఉద్యోగం చేస్తే అక్కడ పనిచేస్తారని, రెండు పనులుచేసే నేర్పరి తనం ఉందన్నారు. అదే పురుషులు కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తారని, ఇంటి పనిచేయరన్నారు. దేవాలయాల సందర్శనపై ఆమె మాట్లాడుతూ దేవాలయాలకు హెలికాప్టర్ల ద్వారా వెళితే అనుభూతి ఉండదన్నారు. నిజమైన ఆనందం పొందలేమన్నారు. ఆధునిక రవాణా మార్గాల ద్వారా గుడికివెళ్లి ద ర్శనం చేసుకోవడం వల్ల సంతృప్తి కలగదన్నారు. వీఐపీ దర్శనాల్లో కూడా దేవాలయాలకు వెళ్లి దేవుడిని ఆరాధించామన్న ఆనందం కలగదన్నారు. జనంలో ఉండి దేవుడిని చూసి వెళితే ఆనందం వేరన్నారు. కొంత మంది భక్తులు క్యూలో నిలబడి ఉంటే, వీఐపీలు త్వరితగతిన దర్శనం చేసుకుని వెళితే దేవుడి ఆశీర్వాదాలు లభించవన్నారు. ఆదివారం ఇక్కడ భారత్ వికాస్ పరిషత్ అనే సంస్థ మహిళా ఉద్యోగినుల సదస్సును ఏ ర్పాటు చేసింది. ఈ సదస్సును స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వివాహం తర్వాత కొత్త కుటుంబంలో అడుగుపెట్టినప్పటి నుంచి మహిళ బాధ్యతలు పెరుగుతాయన్నారు. అప్పటి నుంచి యాజమాన్య నిర్వహణ పద్ధతులను నేర్చుకుంటారన్నారు. పుట్టింటిని వదిలిపెట్టి మెట్టింటికి వచ్చిన తర్వాత కొత్త కుటుంబంలో అందరు తమ సభ్యులేనని భావిస్తారన్నారు. ఒక ఎంపీ తనతో మాట్లాడుతూ భార్య సహకారం వల్లనే తాను ఉన్నత విద్యను పూర్తి చేశానని చెప్పారని స్పీకర్ చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినట్లు, పక్షికి రెండు రెక్కలు ఉన్నట్లు, ప్రతి సమాజం, దేశం ప్రగతికి స్ర్తి, పురుషులు సంయుక్తంగా పాటుపడాలన్నారు. ఒక కుటుంబంలో తల్లి పాత్ర గొ ప్పదని, ఆమె చతురతతో వ్యవహరిస్తే ఆ ఇల్లు బాగుపడుతుందన్నారు. మహిళ కుటుంబ భారాన్ని మోస్తూ, పిల్లలను చక్కగా తీర్చిదిద్దుతుందన్నారు. తన పిల్లలకు ఎప్పుడు ఏం కావాలి, ఆకలి ఎప్పుడు వేస్తుందనే విషయం తల్లి మాత్రమే చెప్పగలదన్నారు. కుటుంబ సంక్షే మం, స్థితి గతులు బాగుపడేందుకు ఏమి కావాలో మహిళకు స్పష్టమైన అవగాహన ఉంటుందన్నారు.