జాతీయ వార్తలు

2030 నాటికి ప్రపంచంలో మూడో స్థానంలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 2030 నాటికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలుస్తోందని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ అన్నారు. ఆదివారం ఉప్పల్‌లో ఆధునిక సౌకర్యాలతో నెలకొల్పిన సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్ (సీడీఎప్‌డీ) నూతన క్యాంపస్‌ను ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్. ప్రభాకర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రెటరీ రేణు స్వరూప్, డైరెక్టర్ డిబాసిస్ మిత్రాలతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా హర్ష వర్ధన్ మాట్లాడుతూ దేశాన్ని సాంకేతిక రంగంలో పరుగులు పెట్టించేందుకు మోదీ సర్కార్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడుతూ అక్కడి శాస్తవ్రేత్తలు భారత్ వైపు చూసేలా చేస్తున్నట్టు చెప్పారు. నేరస్థులను గుర్తించేందు, నేరాలను అదపు చేయడంతో పాటు జన్యు సంబంధ సమస్యలు వాటి పరిష్కార మార్గాలకు సీడీఎప్‌డీ ఎంతగానో తోడ్పాటును అందించనుందన్నారు. 22 ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్న సంస్థను రూ.115 కోట్లతో సువిశాల స్థలంలో నిర్ధేశిత సమయంలో పూర్తిచేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సాంకేతిక ఫలాలను సాదారణ వ్యక్తులకు సైతం చేరువ చేయగలిగినప్పుడే అభివృద్ధి సార్థకత చేకూరుతోందన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి శాస్త్ర సాంకేతిక పరిశోధనల ద్వారానే పరిష్కరించుకోగలుగుతామని చెప్పారు. ఫోరెన్సిక్ పరిశోధనలకు, డీఎన్‌ఏ ఆధారిత కేసులను త్వరిత గతిన ఛేధించేందుకు ఊతం ఇచ్చే డీఎన్‌ఏ బిల్లుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటల్ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ బిల్లును రూపొందించగా అప్పటి నుంచి వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుందన్నారు. కాగా ఇటీవల ప్రస్తుత సాంకేతికతలను దృష్టిలో ఉంచుకొని పలు సవరణలతో కేంద్ర కాబినెట్ దీనిని ఆమోదించిందని చెప్పారు. అనంతరం సీడీఎఫ్‌డీ ప్రాంగణంలో అక్కడి అధికారులతో కలిసి మంత్రి హర్షవర్ధన్ మొక్కలు నాటారు.

చిత్రం..ఉప్పల్ సీడీఎప్‌డీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్