జాతీయ వార్తలు

‘నీట్’ ఏడాదికి ఒక్కసారే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, దంత కళాశాలల్లో ప్రవేశానికి ఇకముందు ప్రతి సంవత్సరం రెండుసార్లు ‘నీట్’ ప్రవేశ పరీక్షను నిర్వహించాలనే యోచనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ వైద్య విద్యలో ప్రవేశానికి ‘నీట్’తోపాటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఇకముందు ఏటా రెండుసార్లు జాయింట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ గతనెలలో తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షలు రెండూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అయి తే, ‘నీట్’ను ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని, దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై మరింత ఎక్కువ పడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు తెలిపింది. ఇప్పటిలాగే ఏటా ఒక్కసారే ‘నీట్’ ప్రవేశపరీక్ష జరుగుతుందని అధికారి స్పష్టం చేశారు.