జాతీయ వార్తలు

హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఇక శాకాహార వంటకాల కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో శాకాహార వంటకాలను ప్రత్యేకంగా చేర్చాలని కేంద్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో శాకాహార వంటకాల కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలుచేయనున్నట్టు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది. మూడేళ్ల డిగ్రీ సైన్సు కోర్సులో హాస్పటాలిటీ, హోటల్ పరిపాలనకు తోడుగా స్పెషలైజేషన్ కింద శాకాహార వంటకాల కోర్సు ఉంటుంది. గాంధీనగర్, జైపూర్, భోపాల్‌లోని ప్రభుత్వ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో ఈ కోర్సులు అమలుచేస్తారు.