జాతీయ వార్తలు

అశ్లీలం, అసత్యాలను కట్టడి చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: వాట్సాప్‌లో అసత్య సందేశాలు, అశ్లీల సమాచారం వంటి వాటిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రయత్నాలు ప్రారంభించింది. తప్పుడు సమాచారంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ఇక్కడ వాట్సాప్ చీఫ్ క్రిస్ డేనియల్స్‌లో సమావేశమయ్యారు. అత్యంత ప్రాచుర్యం ఉన్న వాట్సాప్‌లో వెర్రితలలు వేస్తున్న ఇలాంటి వాటిని నిరోధించాల్సి అవసరం ఉందని డేనియల్స్‌కు మంత్రి గట్టిగా చెప్పారు. క్రిస్‌తో జరిగిన సమావేశం వివరాలను రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. సామాజిక మాద్యమాలంటే తమకు ఎంతో గౌరవం ఉందన్న మంత్రి ఇటీవల అసత్య ప్రచారం, అశ్లీల సమాచారం సమాజాన్ని పాడుచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని కట్టడి చేయాలని క్రిస్ డేనియల్స్‌కు పలు సూచనలు చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధికంగా వాట్సాప్ వాడుతున్నారన్న విషయం క్రిస్ దృష్టికి తీసుకెళ్లిన రవిశంకర్ ప్రసాద్ ‘వాట్సాప్ వినియోగదారుల కోసం భారత్‌లోనే ఓ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలి’ అని అన్నారు. ‘మా చట్టాల ఉల్లంఘన జరుగుతోంది. మూక దాడులు చోటుచేసుకుంటున్నాయి. విశృంఖలంగా అశ్లీల దృశ్యాలు వ్యాప్తి చేస్తున్నారు. వీటికి ఓ పరిష్కారం కనుగొనాలి’ అని ఆయన క్రిస్‌కు చెప్పారు. భారత్‌లోనే ఓ కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారం, నకిలీ సందేశాలు నిరోధించేందుకు, వాటిపై నిఘా వేసేందుకు ఓ యంత్రాంగం ఉండాలని, భారత్‌లోనే ఫిర్యాదుల పరిష్కారానికో అధికారిని నియమించాలని ఆయన సూచించారు. ‘ఇక్కడే ఓ అధికారిని నియమించడంతోపాటు మా చట్టాల గురించి అవగాహన కల్పించాలి. అన్నింటికీ అమెరికా నుంచి సమాధానాలు రావడాన్ని మేం అంగీకరించబోం’ అని కేంద్ర ఐటీ మంత్రి తెలిపారు. ‘వాట్సాప్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఆయన తేల్చిచెప్పారు. సమాజంలో అశాంతికి కారణమవుతున్న అసత్య సందేశాలను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. తన సూచనలు, సలహాలకు వాట్సాప్ సంస్థ సానుకూలంగా స్పందించిందని మంత్రి వెల్లడించారు. కాగా క్రిస్ డేనియల్స్ భారత్‌లో నాలుగైదు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉందిన సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన భేటీ అవుతారు.