జాతీయ వార్తలు

నా పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంఢీగఢ్, ఆగస్టు 21: సొంత కాంగ్రెస్ పార్టీ నుంచే కాక, దేశవ్యాప్తంగా తన చర్యపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివరణ ఇచ్చుకున్నారు. తన మిత్రుడు ఇమ్రాన్‌ఖాన్ ప్రధానిగా ప్రమాణస్వీకార ఉత్సవానికి రమ్మని చేసిన ఆహ్వానం మేరకే తాను ఇస్లామాబాద్ వెళ్లానని, తన పర్యటనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మన ప్రధాని నరేంద్రమోదీ 2015లో లాహోర్ పర్యటించినప్పుడు అప్పటి ప్రధాని నవజ్‌షరీఫ్‌ను కౌగిలించుకోవడం తప్పు కానప్పుడు తాను చేసిన పని ఎలా తప్పవుతుందని ఆయన ప్రశ్నించారు. కర్తాపూర్ సాహిబ్‌కు మార్గాన్ని వదులుతానని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ భజ్వా తనకు తెలియజేయడంతో ఉద్వేగంతో అతడిని కౌగిలించుకున్నానని సిద్ధూ తెలిపారు. అంతేకాని తర్వాత ఆయనతో తాను ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన వివరణ ఇచ్చారు. గురునానక్ దేవ్ 18 సంవత్సరాల పాటు నివసించిన కర్తాపూర్ సాహిబ్ ప్రాంతాన్ని దర్శించడానికి కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారని, అందుకే తాను ఆ విషయాన్ని భజ్వాతో ప్రస్తావించానని తెలిపారు. తన చిరకాల మిత్రుడు ఇమ్రాన్ ఆహ్వానం మేరకు తాను పాక్‌వెళ్లానని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్ధూ ఆ దేశ అర్మీ చీఫ్ జనరల్ భజ్వాను కౌగిలించుకోవడం వివాదాస్పదమైంది. ఆయన చర్యను ఆ పార్టీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం విమర్శించారు. సిద్దూ అలా చేయడం తప్పని వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా సిద్ధూపై విమర్శలు చేసింది.