జాతీయ వార్తలు

3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: వచ్చే ఎన్నికలను, జమ్ముకాశ్మీర్‌లో మిలిటెన్సీ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్రం రాజకీయ నిర్ణయాలు తీసుకుంది. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. కాగా జమ్ముకాశ్మీర్‌కు బీహార్ గవర్నర్‌ను బదిలీ చేశారు. బీహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను జమ్ముకాశ్మీర్ గవర్నర్‌గా నియమించారు. కాశ్మీర్ గవర్నర్‌గా పదేళ్లు పనిచేసిన ఎన్‌ఎన్ వోహ్రా స్థానంలో సత్యపాల్ మాలిక్‌ను నియమించడం విశేషం. బీహార్ గవర్నర్‌గా లాల్జీ టాండన్‌ను నియమించారు. హర్యానా గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి వౌర్యను నియమించారు. కేంద్రప్రభుత్వం సిఫార్సు మేరకు బీహార్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ , బీహార్, హర్యానా, త్రిపుర, మేఘాలయ గవర్నర్లను బదిలీ చేస్తూ రాష్టప్రతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. హర్యానా గవర్నర్ కప్తన్ సింగ్ సోలంకిని త్రిపురకు బదిలీ చేశారు. మేఘాలయ గవర్నర్ గంగ ప్రసాద్‌ను సిక్కింకు బదిలీ చేశారు. త్రిపుర గవర్నర్ టి రాయ్‌ను మేఘాలయకు బదిలీ చేశారు. జమ్ముకాశ్మీర్ గవర్నర్‌గా నియమితులైన సత్యమాల్ మాలిక్‌ను నియమించడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. 72 ఏళ్ల సత్యపాల్ మాలిక్ పూర్తి స్థాయి రాజకీయవేత్త. మాలిక్ గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో, కేంద్రంలో అనేక కీలక పదవులను నిర్వహించారు. రాజ్యసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు. 1989-90 మధ్య లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. 1974 నుంచి 1977 వరకు యూపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా విధులు నిర్వహించారు. మంచి పార్లమెంటేరియన్‌గా పేరుతెచ్చుకున్నారు. పార్లమెంటుకు సంబంధించిన అనేక కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. కాశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన ఎన్‌ఎన్ వోహ్రా పదేళ్ల నుంచి అంటే 2008 నుంచి పనిచేశారు. సత్యపాల్ మాలిక్ భారతీయ క్రాంతిదళ్, లోక్‌దళ్, కాకంగ్రెస్, జనతాదళ్, బీజేపీ పార్టీల్లో కొనసాగారు.
బిహార్ గవర్నర్‌గా నియమితులైన ఎల్జీ టాండన్ వయస్సు 83 సంవత్సరాలు. వాజపేయికి సన్నిహితుడు. 2004లో లక్నోలో చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 21 మంది మరణించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్జీ టాండన్ నిర్వహించారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా నియమితులైన బేబీ రాణి వౌర్య యూపీ జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యునిగా ఉన్నారు. ఆగ్రాకు చెందిన బీజేపీ నేత. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఢిల్లీ పోలీసు కమిషనర్ కేకేపాల్ పదవీ కాలం పూర్తయింది. కాగా బీహార్‌కు చెందిన సత్య దేవ్ నారాయణ్ ఆర్య ఎనిమిది సార్లు బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన బీజేపీ- జేడీయూ మంత్రివర్గంలో 2010లో మంత్రిగా పనిచేశారు.