జాతీయ వార్తలు

జమిలి ఎన్నికలు సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌సభ, శాసనసభలకు సంబంధించి జమిలి ఎన్నికలకు అవకాశం లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. 2019లో లోక్‌సభకు, శాసనసభలకు కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించే విషయమై ఇటీవల లా కమిషన్ కసరత్తు చేసిన విషయం విదితమే. న్యాయపరమైన అవరోధాలను తొలగించి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం లేదన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగపరమైన అవరోధాలు ఉన్నాయి. వీటిని తొలగించాల్సి ఉంటుందని ఆయన ఒక వార్తా ఏజన్సీకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక దేశం, ఒక ఎన్నిక అనే విధానాన్ని సమర్థించిన విషయం విదితమే. జమిలి ఎన్నికలకు తాము అనుకూలమంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇటీవల లా కమిషన్‌కు లేఖ రాశారు. జమిలి ఎన్నికలు విపక్షాలు రాజకీయ దురుద్దేశ్యంతో వ్యతిరేకిస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అంతకు ముందు రాజస్తాన్, చత్తీస్‌ఘడ్,
మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. కాని వేరువేరుగా కాకుండా వ్యయ నియంత్రణలో భాగంగా లోక్‌సభతో పాటు ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే బాగుంటుందని బీజేపీ ఆది నుంచి ప్రతిపాదిస్తోంది. లా కమిషన్ కూడా జమిలి ఎన్నికలు మంచివంటూ ఒక ప్రతిపాదన చేసింది. ఈ అంశంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపింది. కాంగ్రెస్, తృణమూల్, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, డీఎంకే, టీడీపీ, వామపక్ష పార్టీలు, జేడీఎస్ పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. సమాఖ్య స్ఫూర్తికి జమిలి ఎన్నికలు విరుద్ధమని, సాధ్యం కాదని విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. లోక్‌సభను ముందుగా రద్దుచేసి అసెంబ్లీ ఎన్నికలతో కలిసి జమిలి ఎన్నికలకు నిర్వహించే సత్తా ఉందా అని కాంగ్రెస్‌పార్టీ ప్రధాని నరేంద్రమోదీకి సవాలుకూడా విసిరింది. బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జమిలి ఎన్నికలు మంచివేనని, కాని ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యంకాదని పేర్కొన్నారు.