జాతీయ వార్తలు

రెండు నెలల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కొన్ని సంస్థలకు రుణాలు మంజూరు చేసే విషయంలో ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) చందా కొచ్చర్ భవితవ్యం శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంది. చందా కొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు జరుపుతోంది. కమిటీ నివేదిక మరో రెండు, రెండున్నర నెలల్లో రానుందని, వచ్చిన తరువాత చందా కొ చ్చర్‌ను కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయం ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది గురువారం ఇక్కడ చెప్పారు. కమిటీ నివేదిక వచ్చేవరకు కొచ్చర్ సీఈఓ పదవిలో కొనసాగుతున్నారని వివరించారు. అయితే కొచ్చర్ ప్రస్తుతం నిరవధిక సెలవులో ఉన్నారు.