జాతీయ వార్తలు

పాఠ్యాంశాలుగా వాజపేయి పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 23: దివంగత మాజీ ప్రధాని వాజపేయి హయాంలో చేపట్టిన కార్యక్రమాలు వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాలుగా చేర్చనున్నట్టు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నానీ వెల్లడించారు. దీనిపై కసరత్తు చేయాలంటూ అజ్మీర్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను ఆదేశించినట్టు గురువారం ఇక్కడ తెలిపారు.‘వాజపేయి హయాంలో చేపట్టిన కార్యక్రమాలు పాఠ్యాంశాలుగా చేర్చనున్నాం. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని బోర్డును ఆదేశించాం’అని మంత్రి తెలిపారు. రాజనీతిజ్ఞుడు వాజపేయి గురించి తెలుసుకోవల్సిన అవసరం విద్యార్థులకు, భావి తరాలకు ఉందని ఆయన చెప్పారు.‘కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్‌లో అణు పరీక్షలు, సర్వశిక్ష అభియాన్, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలు ఎన్నో వాజపేయి ప్రవేశపెట్టారు. వాటన్నింటినీ విద్యార్థులకు బోధించాల్సిన బాధ్యత ఉంది’అని వాసుదేవ్ పేర్కొన్నారు. దేశం కోసం తాగ్యాలు చేసిన మహోన్నతుల చరిత్ర విద్యార్థులకు బోధించాలన్న మంత్రి నాలుగేళ్ల నుంచి రాజ్‌పుట్ వీరుడు మహారాణా ప్రతాప్ గురించి పాఠ్యాశంగా చేర్చినట్టు తెలిపారు.