జాతీయ వార్తలు

ఆందోళన వద్దు.. ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 23: కేరళ ముఖ్యమంత్రి పీ విజయన్ గురువారం వరద బాధితుల పునరావాస కేంద్రాలను సందర్శించినప్పుడు ప్రజలు ఆక్రందనలు, హాహాకారాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి ఎదుట బాధితులు తమ కష్టాలను ఏకరువుపెట్టారు. ఛెంగన్నూర్, కోజెచెర్రి, అలప్పుజ, ఉత్తర పరావూర్, ఛాలకుడే జిల్లాల్లోని పునరావాస శిబిరాలను ముఖ్యమంత్రి సందర్శించారు. బాధితులను ఆయన ఓదార్చారు.‘మీరు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. మీ అవసరాలన్నీ ప్రభుత్వం తీరుస్తుంది. మీ బాధలు విని వాటిని పరిష్కరించడానికి వచ్చాను’అని సీఎం విజయన్ భరోసా ఇచ్చారు. వరద పీడత ప్రాంతాల్లో చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను సచివాలయం నుంచే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పరిష్కారానికి ఆదేశాలిస్తున్న ముఖ్యమంత్రి హెలీకాప్టర్ ద్వారా పునరావస శిబిరాలకు వెళ్లి ఓదార్చారు. అనేక మంది బాధితులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వందేళ్ల తరువాత సంభవించిన ఉపద్రంతో సర్వం కోల్పోయామని శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు వాపోయారు. బాధితులను ఆదుకోడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నిత్యావసరాలతో కూడిన కిట్లు, పిల్లలకు దుస్తులు, మహిళలకు నేటీలు ప్రభుత్వం అందజేస్తోంది. నిత్యావసరాల కిట్‌లలో రైస్, పంచదార, కందిపప్పు ఉంటుంది. వరద నీరు తగ్గడంతో ఇళ్లకు చేరుకుంటన్న బాధితులను విషసర్పాలు భయపెడుతున్నాయి. సహాయ కార్యక్రమాలు చేపడుతునే పరిసరాల పరిశుభ్రత కోసం ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇళ్లవద్ద, బహిరంగ ప్రదేశాలను యుద్ధప్రాతిపదికన శుభ్రం చేస్తున్నారు. నీట్లో కొట్చుకొచ్చిన జంతువుల కళేబరాలు ఎక్కడికక్కడే ఉండడంతో వాటిని తొలగించడం పెద్ద సవాల్‌గా మారింది. గత రెండు రోజులుగా ఐదువేల జంతు కళేబరాలను తొలగించినట్టు అధికారులు వెల్లడించారు. వాటిని శివారు ప్రాంతాలకు తీసుకెళ్ళి దహనం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. బురద చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రాంతాలను శుభ్రం చేయడం, పారిశుద్ధ్య పనివారలను సమన్వయ పరచటం కోసం ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శిథిలాల తొలగింపు, ఇళ్లు, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడానికి 50వేల మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇంటింటికి పంపి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.