జాతీయ వార్తలు

8 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: భారతీయ జనతాపార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చేనె 8,9 తేదీల్లో జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, అనుసరించాల్సి వ్యూహంపై సమావేశాల్లో చర్చిస్తారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. నిజానికి ఈనెల 18,19 తేదీల్లోనే జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగాల్సి ఉంది. బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజపేయి మృతితో సమావేశాలు వాయిదా పడ్డాయి. 2019 ఏప్రిల్-మే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికలపై ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకోసమే ఈసారి జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం అత్యంత కీలకమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత జాతీయ కార్యవర్గ సమావేశాలు సెప్టెంబర్ నెలలోనే జరిగాయి.